
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. తొలిరోజు ఎక్కువ థియేటర్లలో విడుదల కావడంతో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ మూవీకి టాక్ కారణంగా ఆ తర్వాత కలెక్షన్స్ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో పోల్చుకుంటే ఈ సినిమా తేలిపోవడంతో అన్ని చోట్ల వసూళ్లు తగ్గిపోయాయి. ఈ సినిమాకు కేటాయించిన థియేటర్లను కూడా చాలా చోట్ల వాల్తేరు వీరయ్యకు కేటాయించారు. ముఖ్యంగా పండగ సెలవుల తర్వాత వీరసింహారెడ్డి వసూళ్లలో జోరు చూపలేకపోతోంది. ఈ చిత్రానికి రూ.67.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.68 కోట్ల షేర్ రాబట్టల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.73.46 కోట్ల షేర్ రాబట్టింది.
అయితే 12 రోజుల తర్వాత ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ వసూళ్లు రావడమే మానేశాయి..రేపీబ్లిక్ డే వంటి నేషనల్ హాలిడే ని కూడా ఈ చిత్రం ఉపయోగించుకోలేక పొయ్యింది అంటే ఇక బిజినెస్ క్లోజ్ అయ్యిపోయినట్టే అనుకోవాలి..మొత్తం మీద ఈ చిత్రానికి 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఫుల్ రన్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇది బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పాలి..ఆయన హీరో గా నటించిన అఖండ చిత్రానికి 70 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి..అదే ఆయన కెరీర్ హైయెస్ట్..ఆ వసూళ్లను వీర సింహా రెడ్డి చిత్రం దాటేయడం తో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు..ఓపెనింగ్స్ తో పాటుగా క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఈ సినిమా కాస్త బెటర్ గా రాబట్టి ఉంటే వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా దాటి ఉండేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
కానీ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్ లో అద్భుతమైన వసూళ్లు వచ్చాయనే చెప్పాలి..అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 17 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి..కానీ సీడెడ్ కంటే పెద్ద మార్కెట్ అయినా నైజాం లో కూడా అదే 17 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి..ఇలా బహుశా బాలయ్య బాబు కి తప్ప ఎవరికీ జరగదు..గతం లో కూడా ఆయన సూపర్ హిట్ సినిమాలకు ఇలాంటి వసూళ్లే వచ్చాయి..గుంటూరు మరియు కృష్ణ జిల్లాలలో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది..ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా అఖండ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి..అయితే వీర సింహా రెడ్డి చిత్రానికి అభిమానులు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినప్పటికీ బాలయ్య మార్కెట్ అఖండ తర్వాత బాగా పెరిగింది అనే క్లారిటీ అయితే అందరికీ ఇచ్చింది.