Home Entertainment ‘వీర సింహా రెడ్డి’ కి ‘జీరో’ షేర్స్..బాలయ్య ఖాతాలో మరో దరిద్రంగా రికార్డు

‘వీర సింహా రెడ్డి’ కి ‘జీరో’ షేర్స్..బాలయ్య ఖాతాలో మరో దరిద్రంగా రికార్డు

0 second read
0
0
13,040

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. తొలిరోజు ఎక్కువ థియేటర్లలో విడుదల కావడంతో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ మూవీకి టాక్ కారణంగా ఆ తర్వాత కలెక్షన్స్ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో పోల్చుకుంటే ఈ సినిమా తేలిపోవడంతో అన్ని చోట్ల వసూళ్లు తగ్గిపోయాయి. ఈ సినిమాకు కేటాయించిన థియేటర్లను కూడా చాలా చోట్ల వాల్తేరు వీరయ్యకు కేటాయించారు. ముఖ్యంగా పండగ సెలవుల తర్వాత వీరసింహారెడ్డి వసూళ్లలో జోరు చూపలేకపోతోంది. ఈ చిత్రానికి రూ.67.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.68 కోట్ల షేర్ రాబట్టల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.73.46 కోట్ల షేర్ రాబట్టింది.

ముఖ్యంగా 12వ రోజు వసూళ్లను గమనిస్తే వీరసింహారెడ్డి సినిమా రెండో వారంలో ఎంత దారుణంగా ఆడుతుందో చెప్పవచ్చు. 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కేవలం రూ.16 లక్షలు మాత్రమే వసూలు చేసింది. చాలా చోట్ల నష్టాలతో ఈ సినిమాను ప్రదర్శించారు. మొత్తంగా 12వ రోజు ఈ మూవీకి వచ్చిన షేర్ జీరో అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 12 రోజుల కలెక్షన్‌లను గమనిస్తే నైజాంలో రూ.16.65 కోట్లు, సీడెడ్‌లో రూ.16.1 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.36 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.5.51 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.4.13 కోట్లు, గుంటూరులో రూ.6.3 కోట్లు, కృష్ణాలో రూ.4.62 కోట్లు, నెల్లూరులో రూ.2.88 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.4.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5.71 కోట్లు వసూలు చేసింది. అటు ఇటీవల ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ హైదారాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు దర్శకులు హరీష్ శంకర్, హను రాఘవపూడి, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ .. బీవీఎస్ రవి, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హాజరయ్యారు.

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బాలయ్య మాట్లాడుతూ ఏ విషయాన్ని అయినా నిజాయితీగా, ధైర్యంగా చెప్పడం అనేది ఒక గర్జనలా ఉండాలని.. అలా ఉండాలంటే తనలా సింహంలా పుట్టాలని వ్యాఖ్యానించాడు. వీరసింహారెడ్డి సినిమాలో ఎదురులేని .. బెదురులేని వీరసింహారెడ్డిని తానేనని.. చాలా ఏళ్ల తరువాత తాను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది అని గుర్తుచేశాడు. తన మేనరిజంలో నుంచే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయని.. ఆ విషయంలో బోయపాటి సమర్థుడు అని ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ సారి తన మేనరిజం నుంచి వీరసింహారెడ్డి సినిమాను గోపీచంద్ తీశాడని తెలిపాడు. ఈ కథను వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ భాషల వారు కూడా ఆదరించడం విశేషం అన్నాడు. ఈ సినిమాకి దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ విలనిజం హైలైట్‌గా నిలిచాయని చెప్పాడు. తమన్ పాటలు ప్రాణం పోశాయని.. మొత్తంగా ఈ మూవీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ బాలయ్య తన ప్రసంగంలో పేర్కొన్నాడు. కాగా వీరసింహారెడ్డి మూవీని బాలయ్య ఐదు నిమిషాల్లో ఓకే చేశారని.. అలా ఈ సినిమా పట్టాలెక్కిందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…