
ఈమధ్య కాలం లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమాలలో ఒకటి విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రం.టీజర్ ,ట్రైలర్ మరియు పాటలు,ఇలా ప్రమోషనల్ కంటెంట్ మొత్తం యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేయడం, ఆయన ఈ సినిమా గురించి అద్భుతంగా మాట్లాడడం ఆడియన్స్ కి ఈ సినిమా పై అంచనాలు పెంచేలా చేసింది.విశ్వక్ సేన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం లో ఒక ప్రత్యేకమైన మార్కుని చూపిస్తాడు.ఈ సినిమా విషయం లో కూడా ఆయన అదే చేస్తున్నాడు.ఈ చిత్రం లో ఆయన హీరో గా నటించడమే కాకుండా, దర్శకుడిగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఇంత చిన్న వయస్సు లో ఇన్ని బాధ్యతలు చేపట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.
టాలీవుడ్ చరిత్ర తీసుకుంటే అంతకు ముందు ఎవ్వరూ కూడా ఇలా ఇంత చిన్న వయస్సులో ఇన్ని బాధ్యతలు మొయ్యలేదు.మరి విశ్వక్ సేన్ ఈ ధమ్కీ విషయం లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.సినిమా ప్రారంభం నుండే యూత్ ని ఆకట్టుకునే డైలాగ్స్ తో ప్రారంభిస్తాడు విశ్వక్ సేన్.ఆయన మార్కు యాటిట్యూడ్ తో కూడిన సన్నివేశాలను ఈ చిత్రం లో ఫుల్లుగా చూడొచ్చు.పాటలు చాలా బాగున్నాయి, విడుదలకు ముందే ఈ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి, ఇక వెండితెర మీద ఆ సాంగ్స్ చిత్రీకరణ చాలా చక్కగా అనిపించింది.ప్రథమార్ధం మొత్తం ఎంటర్టైన్మెంట్, మధ్య మధ్య లో ఫైట్స్ తో నిండిపోయి యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తాది.కానీ ద్వితీయార్థం మాత్రం ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు అనిపించింది.
రీసెంట్ గానే ధమాకా వంటి సూపర్ హిట్ చిత్రానికి కథ అందించిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకి కూడా కథ అందించాడు.ఆయన కథలు మొత్తం కేవలం ఒక ఆడియన్స్ ని టార్గెట్ చేస్తునట్టు ఉండదు, అన్ని వర్గాలను టార్గెట్ చేస్తునట్టు ఉంటుంది,ఈ సినిమా కూడా అలాగే ఉంది.ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా క్లిక్ అయ్యింది.ప్రస్తుతం సినిమాలేవీ లేవు కాబట్టి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది.విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం తానూ సంపాదించినది మొత్తం పెట్టేసాను అని చెప్పుకొచ్చాడు.ఆ డబ్బులు మొత్తం ఈ చిత్రం వారం లోపే రికవరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.కెరీర్ లో ఎలాంటి హిట్టు కోడమైతే విశ్వక్ సేన్ ఎదురు చూస్తున్నాడో, అలాంటి హిట్టు దొరికినట్టే అని చెప్పాలి.