
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మీనా వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం విషాదం నెలకొంది. కొద్దిరోజుల కిందట ఆమె భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో తుదిశ్వాస విడిచాడు. అయితే సెలబ్రిటీల జీవితాలపై ఇంట్రస్ట్ చూపించే మీడియా మీనా భర్త మరణం విషయంలోనూ వదల్లేదు. దీంతో మీనా భర్త మరణానికి కారణాలను విశ్లేషించడం ప్రారంభించింది. విద్యాసాగర్ పావురాల కారణంగానే చనిపోయాడని ప్రచారం చేసింది. అయితే ఈ వార్తల పట్ల మీనా అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భావోద్వేగానికి కూడా గురైంది. జూలై 12న మీనా పెళ్లి రోజు కావడంతో తన భర్తను గుర్తుచేసుకుని మీనా కన్నీటిపర్యంతమైంది. తన భర్తను దేవుడు ఇచ్చిన ఓ అద్భుతమైన బహుమతిగా కీర్తించింది. కానీ ఆ దేవుడు తన నుంచి తన బహుమతిని దూరంగా తీసుకువెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ తన భర్త ఎప్పటికీ తమ గుండెల్లోనే ఉంటారని మీనా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే మీనాపై కొత్తగా సోషల్ మీడియాలో మరో రూమర్ హల్‌చల్ చేస్తోంది. మీనానే తన భర్తను చంపించిందంటూ పలు మీడియాలలో వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మీనా భర్త విద్యాసాగర్‌కు రూ.250 కోట్ల ఆస్తి ఉందని.. ఆ ఆస్తి తనకు దక్కడం లేదనే కారణంతోనే మీనా తన భర్తను చంపించిందని కోలీవుడ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా భర్త మరణానికి కొద్దిరోజుల ముందు మీనాకు, ఆమె భర్తకు ఆస్తి గురించి గొడవలు అవుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది. దీంతో విద్యాసాగర్ తన కూతురు నైనిక పేరుమీదుగా తన ఆస్తి వీలునామా రాశారని తెలుస్తోంది. నైనిక మేజర్ అవ్వగానే ఆమెకు, ఆమె భర్తకు ఆస్తి చెందేలా విద్యాసాగర్ వీలునామా రాయించారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నైనిక మేజర్ అయ్యేవరకు గార్డియన్‌గా ఉండేవారు ఆస్తిని చూసుకోవాలని వీలునామాలో ఉందని అంటున్నారు. దీంతో విద్యాసాగర్ తన భార్య మీనాకు షాకిచ్చాడని అంటున్నారు.అయితే మీనా సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. అసలు ఇలాంటి వార్తలు ఎలా ప్రచారం చేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక కుటుంబం ఆపదలో ఉంటే ఇలాంటి వార్తలు పనిగట్టుకుని ప్రచారం చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే తన భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మీనా.. తన భర్త మరణం గురించి వస్తున్న వార్తలపై స్పందించి దయచేసిన తనపై తప్పుడు వార్తలను అసలు ప్రచారం చేయవద్దని తనకు కాస్త ప్రైవసీ కల్పించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. అయినా ఓ వర్గం మీడియా మీనాను వదిలిపెట్టకుండా ఆస్తులు, పూర్వపరాలు గురించి వార్తలు లీక్ చేస్తూనే ఉండటంతో నెటిజన్‌లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా మీనా ఫస్ట్ నుండి సైలెంట్‌గా ఉండేది. తన పని తాను చూసుకుని వెళ్లిపోయేది. ఎలాంటి కాంట్రవర్సీలకు పోయేది కాదు. ఎవరితోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాలు కూడా లేవు. అందుకే స్టార్ హీరోలందరూ ఆమెతో పనిచేశారు. ఆమె పనితనం గురించి పలుమార్లు స్టార్ హీరోలందరూ ప్రశంసించారు. కానీ ఇప్పుడిలా మీనాపై ఆరోపణలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.