
ఈ తరం వాళ్లకి రఘువరన్ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ’1990 వాళ్లకి రఘువరన్ అంటే చాల ఇష్టం. విలన్స్ కి ఫాన్స్ ఉంటారు అని రఘువరన్ చేసి చూపించాడు. నాగార్జున కెరీర్ ని టర్న్ చేసిన మూవీ “శివ” అందులో నాగార్జున తో అదే తరహా లో విలన్ గ రఘువరన్ కి మంచి పేరు వచ్చింది. శివ, పసివాడి ప్రాణం, బాషా సినిమాల్లో రఘువరన్ కి మంచి పేరు లు తెచ్చిపెట్టాయి..రఘువరన్ పుట్టింది కేరళ రాష్ట్రము లో పాలక్కాడ్ జిల్లాలోని కోలెంగూడెంలో వేలాయుధన్, కస్తూరి దంపతులకు జన్మించాడు. విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్స్ గా తెలుగు , తమిళ భాషలలో మంచి పేరు తెచ్చుకున్నారు రఘువరన్. మన తెలుగు అమ్మాయి రోషిణి తో ఆయనికి వివాహం జరిగింది.
రోషిణి కి రఘువరన్ తో చిన్న వయసు లో వివాహం జరిగింది. అతడితో ప్రేమ లో పడి వివాహం చేసుకుంది. ఈ ఇద్దరికీ ఒక బాబు పుట్టాడు, అతని పేరు సాయి రిషివరన్. ఒక కుమారుడు పుట్టిన కొని రోజులకి రఘువరన్ డ్రగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయాడు. ఈ అలవాటు వలనే తన సినిమా కెరీర్ నాశనం అయింది అని చెప్పుకోవాలి . ఇండస్ట్రీ లో ఉన్న టాక్ ప్రకారం రఘువరన్ అమల ని ప్రాణంగా ప్రేమించాడు అని అది ఓన్లీ వన్ సైడ్ లవ్ అని , ఐతే అమలకి నాగార్జున తో వివాహం జరగడం తో ప్రేమ విఫలం అయింది అని చాల భాధ పడ్డాడు.
ఆ తరువాత బాగా డ్రగ్ అడిక్ట్ అవడం తో తన భార్య రోషిణి కూడా విసుగు పుట్టి విడాకులు ఇచ్చేసింది. చివరికి మార్చ్ 18 న 2008 లో చెన్నై లోనే నిద్రలోనే తన నివాసం లో నే చనిపోయారు రఘువరన్. ఐతే విడాకులు ఇచ్చినపటికి తన శవం ముందు భోరున ఏడ్చేసింది రోషిణి.