
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.బైక్ ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ కోసం అభిమానులతో పాటుగా టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది.సెలెబ్రిటీలందరూ సాయి ధరమ్ తేజ్ ని విష్ చేస్తూ హిట్ కొట్టాలని ఆశీర్వదించారు.ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, డైరెక్టర్ కార్తీక్ దండు ఎదో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, హారర్ థ్రిల్లర్ అని, థియేటర్స్ లో చూస్తే ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతి కలుగుతుందని అనిపించింది.ఇక ఈరోజు ఈ చిత్రం విడుదల అయ్యింది,సినిమా విడుదలకి ముందు మనకి కలిగిన అనుభూతి విడుదల తర్వాత కూడా కలిగిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే సుకుమార్ అని చెప్పగానే మనకి సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది.ట్రైలర్ బాగున్నా బాగాలేకపోయిన సుకుమార్ బ్రాండ్ కాబట్టి ఆడియన్స్ ఏమి ఆలోచించకుండా థియేటర్స్ కి కదులుతారు.అలా నమ్మకం తో వచ్చిన ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ సినిమా.ఒక ఊరిలో జరిగే హత్యలు,మూఢనమ్మకాల పేరిట జరుగుతూ ఉంటుంది.నిజంగా మంత్ర శక్తుల వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయా, లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ లో తర్వాత ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠ ని కలగచేసేలా చేసింది ఈ చిత్రం.డైరెక్టర్ కార్తీక్ దండు కి ఇది మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మలేరు.వంద సినిమాలు తీసిన అనుభవం ఉన్నవాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.భవిష్యత్తులో ఆయన టాప్ స్టార్ డైరెక్టర్ అవుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం లో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి.చాలా సన్నివేశాల్లో ఆయన గొంతు నుండి మాటలు రావడం ఎంత ఇబ్బందిగా ఉంది ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది.బైక్ యాక్సిడెంట్ ఆయనని అంతలా దెబ్బ తీసింది.ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.ఈమె మంచి నటి అనే విషయం మన అందరికీ ఆమె గత చిత్రాలు చూసినప్పుడే అర్థం అయ్యింది.ఇక ఈ చిత్రం లో అయితే ఆమె ఏకంగా నట విశ్వరూపమే చూపించింది.ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం.చాలా కాలం తర్వాత ఒక హర్రర్ మిస్టరీ సినిమాని చూసే అనుభూతిని కలిగించిన ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మాత్రం మిస్ అవ్వకండి.