
కోలీవుడ్ లో ఇటీవల కాలం లో మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార -ఎం విగ్నేష్ జంట..ఎంతో మంది హీరోలతో పోరుమాయణం నడిపిన నయనతార చివరికి విఘ్నేష్ ని పెళ్లాడింది..ఆరేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకుంది..అయితే వీళ్లిద్దరి పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే కవల పిల్లలకు జన్మని ఇవ్వడం పెద్ద దుమారం రేపింది..ఆ తర్వాత ఎలా ఇది సాధ్యం అని ఆరా తీస్తే సరోగసి పద్దతి ద్వారా వీళ్లిద్దరు తల్లి తండ్రులు అయ్యారని తెలిసింది..సరోగసి అంటే ఒక స్త్రీ గర్భం లో మన వీర్య కణాలు పంపించి పిల్లల్ని కనే ప్రక్రియ..అంతే అద్దెకు గర్భం ని తీసుకోవడం అన్నమాట..ఈ ప్రక్రియ అంతమందు మన భారతదేశం లో మాములే అయ్యినప్పటికీ, ప్రభుత్వం ఇటీవలే ఈ ప్రక్రియ ని బాన్ చేస్తూ చట్ట రీత్యా నేరంగా పరిగణించింది.
కేవలం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల మధ్యనే సరోగసి ప్రక్రియ చేయించుకోడానికి అర్హులు అంటూ ప్రభుత్వం షరతులు పెట్టింది..అందులో మొదటిది దంపతులిద్దరికీ పెళ్లి జరిగి ఆరేళ్ళు పూర్తి అయ్యి ఉండాలి..అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కలిగి ఉంటేనే ఈ ప్రక్రియ ద్వారా పిల్లల్ని కనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది..అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా సరోగసి ప్రక్రియ ఎందుకు అనుకరించారు..దీనిపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అంటూ తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు నోటీసులు పంపించింది..అప్పుడు వాళ్లిదరు మేము ఈ వివాహం చేసుకొని ఆరేళ్ళు పూర్తి అయ్యిందని..ఆధారాలతో సహా డాకుమెంట్స్ అందించారు..ప్రస్తుతం చెన్నై హై కోర్టు ఈ డాకుమెంట్స్ ని విచారిస్తుంది..ఇది అలా ఉంచితే విగ్నేష్ తల్లి తండ్రులు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు అని తెలిసి ఆగ్రహించారట..ఎట్టిపరిస్థితిలోను ఆ పిల్లలిద్దరినీ తమ వంశాంకురం గా పరిగణియంచము అంటూ నయనతార మరియు విగ్నేష్ దంపతులకు వార్నింగ్ ఇచ్చారట..ప్రస్తుతం వీళ్ళ కుటుంబం లో ఇది పెద్ద సమస్య గా మారిపోయింది.
విఘ్నేష్ తల్లితండ్రులు అలా అనడం తో నయనతార బాగా హర్ట్ అయ్యిందట..పెళ్ళికి ముందు విఘ్నేష్ నయనతార ఇస్తానన్న ఆస్తుల ఒప్పంద పత్రం ని చింపివేసి..తన ఆస్తులన్నీ పిల్లలిద్దరియూ పేరిట రాయించిందట..ఇప్పుడు ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ..అంతే కాకుండా నయనతార ప్రస్తుతం విఘ్నేష్ కి దూరం గా ఉంటున్నట్టు సమాచారం..పెళ్ళై నాలుగు నెలల్లోనే ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందనుకోలేదంటూ అభిమానులు వాపోతున్నారు..అంటే వీళ్లిద్దరు త్వరలోనే విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారా..? అనే చర్చలు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి..చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ..ఇక నయనతార ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ..ఇటీవలే ఈమె మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ అనే చిత్రం లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆమె షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలో నటిస్తుంది.