
కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య జంటలు విడాకులు తీసుకున్న నాటి నుంచి ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా విడాకుల గురించే చర్చ జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటతో పాటు హీరో నిఖిల్ జంట కూడా విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు నిజమో లేదో పక్కన పెడితే తాజా మరో స్టార్ జంట విడాకులు తీసుకుంటుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాళ్లు ఎవరో కాదు టాలీవుడ్ ఒకప్పటి హీరో శ్రీకాంత్-ఊహ జంట. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా ఇప్పటికే శ్రీకాంత్ పెద్ద తనయుడు రోషన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లిసందడి మూవీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీకాంత్ మంచి నటనతో అందరి దృష్టిలో పడ్డాడని చేప్పాలి అవకాశాల కోసం తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లో ఎన్నో ఒడిడుకులు పడ్డాడు కానీ మంచి పేరు వచ్చింది శ్రీకాంత్ హీరో గా అలాగే విలన్ గా కూడా ఆక్ట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు అని చెప్పచ్చు సినిమా కి మంచి క్రజ్ లో ఈ ఇద్దరు మంచి పెయిర్ అని చెప్పచ్చు.
అయితే కొంత కాలంగా శ్రీకాంత్, ఊహ జంట మధ్య విభేదాలు నెలకొన్నాయని.. త్వరలో వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ గాసిప్ రాయుళ్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా సంసారం సాగించిన ఈ జంట ఇప్పుడు గొడవలు పడుతుందని చెప్తుంటే నమ్మబుద్ధి కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్ధికపరంగా శ్రీకాంత్, ఊహ మధ్య గొడవలు జరుగుతున్నాయని కొందరు చెప్తున్నారు. బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల గొడవలు పడుతున్నారని.. రహస్యంగా విడాకులు తీసుకోవడం పక్కా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద మనిషి శ్రీకాంత్, ఊహ మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నాడని.. విడాకుల ఆలోచనను విరమించుకోవాలని సూచిస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ముగ్గురు పిల్లలను చక్కగా చూసుకుని సంసారంలో ముందుకు సాగిపోవాలని.. వాళ్ల కోసమైనా కలిసి జీవించాలని సయోధ్య కుదురుస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వీరు మండ్య రాజి కుదర్చడానికి నేరుగా చిరంజీవి కూడా దిగినట్లు సమాచారం అంతే కాదు వీళ్ళు ఇద్దరు కనీసం పిల్లల కోసం కలిసి జీవించాలనిఅందరు కోరుకుంటున్నారు శ్రీకాంత చాల మంచి వ్యక్తిత్వం కలవారు అని చెప్పచ్చు.
మరి విడాకుల వార్తలపై శ్రీకాంత్, ఊహలలో ఒకరు స్పందిస్తే తప్ప గాసిప్స్‌కు తెరపడేలా కనిపించడం లేదు. శ్రీకాంత్ కెరీర్‌లో తొలుత విలన్‌గా నటించినా తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నాడు. తాజ్‌మహల్, పెళ్లిసందడి, వినోదం, కన్యాదానం, చాలా బాగుంది, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాలు శ్రీకాంత్ కెరీర్‌ను నిలబెట్టాయి. ఆమె సినిమాతో ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువ హీరోల రాకతో శ్రీకాంత్‌కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో కొన్ని నష్టాలు రావడంతో అతడు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. గోవిందుడు అందరివాడేలే, సరైనోడు వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నాడు. అయినా సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. మళ్లీ రీ ఎంట్రీతో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్య నటించిన అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. కాగా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ పేరు తెచ్చుకోవడం గమనించాల్సిన విషయం. త్వరలో శ్రీకాంత్ కుమార్తె సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.