
:టాలీవుడ్ లోనే కాదు..సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య జంట..చూడడానికి ఎంతో ముచ్చటగా అనిపించే ఈ జంట అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే..వీళ్లిద్దరు ఇప్పుడు విడిపోయారు అనే వార్తని వీళ్ళ అభిమానులే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు..మేము విడిపోయాము అనే విషయమే వీళ్లిద్దరి మర్చిపొయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ సోషల్ మీడియా లో మాత్రం వీళ్లిద్దరి గురించి ఇప్పటికి ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది..ఈ జంట కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి..ఏమి లేకపోతేనే వంద పుకార్లు పుట్టించి కాష్ చేసుకునే వెబ్సైటు బ్లాగర్స్ ఉన్న ఈ కాలం లో, నిజంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విడాకులు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఇటీవలే సమంత ‘కాఫీ విత్ కరణ్ ‘ షో లో నాగ చైతన్య కి సంబంధించిన కొన్ని విషయాలు అడిగినప్పుడు ఆమె చెప్పిన కొన్ని సమాదానాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..సమంత ఇంతకు ముందు కూడా పరోక్షంగా నాగ చైతన్య పై సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరుకు సమంత గురించి ఎలాంటి కామెంట్ కూడా చెయ్యలేదు..అలాగే సోషల్ మీడియా లో వస్తున్నా రూమర్స్ పై కూడా ఆయన ఇది వరుకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు..తన సినిమాలకు ఇచ్చే ఇంటర్వూస్ లో కూడా ముందుగా యాంకర్లకు తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి ప్రశ్నలు వద్దు కేవలం సినిమా గురించి మాత్రమే అడగండి అంటూ చెప్పి ఆ తర్వాతే ఇంటర్వూస్ కి అనుమతిని ఇచ్చేవాడు..అయితే ఎంత వద్దు అనుకున్న కొంతమంది ప్రశ్నలు అడగకుండా ఉండరు కదా..అలా ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఒక యాంకర్ విడాకులు గురించి ప్రస్తావన తీసుకొని రాగ ‘అదంతా అయిపోయింది..మేము ఎందుకు విడిపోయాము అనేది మాకు తెలుసు..జనాలకు తెలియాల్సిన అవసరం రాలేదు..విడిపోయిన తర్వాత కూడా ఇద్దరం హ్యాపీ గానే ఉన్నాము కదా..ఒక వెల్ విషెర్ గా సమంత ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటాను..తన చాలా మంచి అమ్మాయి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
అంతే కాకుండా సమంత తో కలిసి నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్న కి నాగ చైతన్య సమాధానం ఇస్తూ ‘ఇది చాలా క్రేజీ ఐడియా..ఇప్పుడు మేమిద్దరం కలిసి చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది..సమంత తో కలిసి నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..దేవుడు భవిష్యత్తులో ఏమి రాసి ఉన్నాడో చూద్దాం..అవకాశం వస్తే కచ్చితంగా నటించడానికి ఒప్పుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య..నాగ చైతన్య లేటెస్ట్ మాటలకు మరియు సమంత లేటెస్ట్ మాటలకు చాలా వ్యత్యాసం ఉంది..విడాకులు తర్వాత కూడా నాగ చైతన్య సమంత పట్ల ఇంత కూల్ గా వ్యవహరిస్తుంటే సమంత మాత్రం ‘మేమిద్దరం ఒకే రూమ్ లో ఉంటె నాగ చైతన్య ని చంపేస్తాను..అంత కోపం గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత..ఎవరినైనా మనిషిని మర్చిపోతే నాగ చైతన్య లాగ కూల్ గా ఉంటారు..కానీ మనిషిని మర్చిపోకుండా అలానే ఉంటె సమంత లాగ పగ తో ఉంటారు..సమంత నాగ చైతన్య ని ఇంకా మర్చిపోలేకపోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.