
ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ఎక్కడ చూసినా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా హవానే కనిపిస్తోంది. తెలుగులో విక్రమ్‌కు తొలి మూడురోజులు అడివిశేష్ ‘మేజర్’ నుంచి కొంచెం పోటీ ఎదురైంది. అయితే వీకెండ్ ముగిశాక మేజర్ చల్లబడిపోవడంతో విక్రమ్ హవా కొనసాగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. కేవలం మౌత్ టాక్‌తో విక్రమ్ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ దక్కుతోంది. దీంతో తొలివారం ఎవరూ ఊహించని రీతిలో విక్రమ్ వసూళ్లు సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా ఐదురోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్‌లను కొల్లగొట్టింది. కేవలం 5 రోజుల్లోనే విక్రమ్ ఈ ఘనత సాధించిందటే విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే విడుదలకు ముందు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే దర్శకుడు లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి.
ఈ సినిమాలో హీరో సూర్య ఉన్నాడని చాలా మంది సినిమా చూసేవరకు తెలియలేదంటే చిత్రయూనిట్ ఎంత గోప్యంగా ఈ విషయాన్ని సస్పె్న్స్‌గా ఉంచిందో అర్ధం చేసుకోవచ్చు. కమల్‌హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్, సూర్య వంటి నటులు విక్రమ్ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేశారు. తొలివారం ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇదే క్రేజ్ కంటిన్యూ అయితే 500 కోట్ల క్లబ్‌లో కూడా ఈ సినిమా అడుగుపెడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగులో రూ.6 కోట్లకు ఈ సినిమా హక్కులను నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి కొనుగోలు చేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానరుపై ఈ సినిమాను విడుదల చేశారు. అయితే తొలి వారంలోనే రూ.9 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడంతో లాభాలను గడిస్తున్నారు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు భారీ తారాగణంతో తెరకెక్కిన విక్రమ్ చిత్రానికి ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి నటులు, సాంకేతిక నిపుణులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. విక్రమ్ సినిమా కోసం హీరో కమల్ హాసన్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక విజయ్ సేతుపతి రూ.10 కోట్లు, ఫాహద్ ఫాజిల్ రూ.4 కోట్ల పారితోషికం అందుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూ.8 కోట్ల వరకు రెమ్యురేషన్‌ను తీసుకోగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రూ.4 కోట్లు తీసుకున్నాడట. గెస్ట్‌రోల్ చేసిన సూర్య రెమ్యునరేషన్‌ను తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించాడట. అయితే కమల్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ మూవీలో ఆయన 67 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్ సీన్స్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.