
#RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని ఒక్క రేంజ్ లో ఊపేసిన చిత్రం కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా..అద్భుతమైన పాటలు మరియు ట్రైలర్ తో విడుదలకు ముందు నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా..విడుదల తర్వాత ఆ అంచనాలను మించి అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టించింది..ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ తనకి ఉన్న మార్కెట్ కి చిల్లు పెట్టుకున్న కమల్ హాసన్..ఒక్కసారి మంచి కమర్షియల్ యాక్షన్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఎలా ఉంటుందో ఉదాహరణగా నిలిచింది విక్రమ్ సినిమా..దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ కి సరైన హిట్టు ఈ సినిమానే అని చెప్పొచ్చు..మధ్యలో విశ్వరూపం సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన విశ్వరూపం 2 మరియు ఉత్తమ విలన్ వంటి సినిమాలు కమల్ హాసన్ మార్కెట్ ని చాలా తీవ్రంగా దెబ్బ తీసి ఆయనని అప్పులపాలు చేసాయి..ఇప్పుడు విక్రమ్ సినిమాతో సెన్సషనల్ హిట్ కొట్టి అటు హీరో గా తన స్టామినా ఎలాంటిదో అందరికి మరోసారి చూపిస్తూనే..నిర్మాతగా కూడా లాభాల వర్షం చూసాడు.
ఇక ఇన్ని రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ములేపేసిన ఈ సినిమా ఇప్పుడు క్లోసింగ్ కి దగ్గరకి వచ్చేసింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము..ముందుగా మన తెలుగు వెర్షన్ గురించి మాట్లాడుకోవాలి..ఈ సినిమా తెలుగు హక్కులను హీరో నితిన్ అతి చవకగా 6 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసాడు..కానీ ఈ ఆరు కోట్ల రూపాయిలు ఆయనకీ కేవలం నైజం ప్రాంతం లోనే రికవర్ అయ్యాయి..నైజం ఏరియా లో ఇప్పటి వరుకు ఈ సినిమా 7 కోట్ల రూపాయిల వరుకు వసూళ్లను రాబట్టింది..ఇక రాయలసీమ ప్రాంతం లో 2 కోట్ల 14 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా ఉత్తరాంధ్ర లో రెండున్నర కోటి రూపాయిల షేర్..ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్..అలాగే కృష్ణ జిల్లాలో 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అంటే పెట్టిన డబ్బులకు మూడింతలు లాభాలు ఆర్జించింది అన్నమాట.
ఇక తమిళనాడు లో గత వారం బాహుబలి పార్ట్ 2 వసూళ్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు 170 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..అలాగే కర్ణాటక ప్రాంతం లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా..కేరళ లో 37 కోట్ల రూపాయిలు..రెస్ట్ ఆఫ్ ఇండియా లో 11 కోట్ల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేసింది..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ప్రభంజనం మామూలుది కాదు..సుమారు 110 కోట్లరూపాయిల గ్రాస్ ని ఈ సినిమా ఓవర్సీస్ నుండి వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 380 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి 190 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది..కమల్ హాసన్ ఈ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు అని చెప్పొచ్చు..ఈ సినిమాకే ఈ స్థాయి వసూళ్లు వస్తే ఇక విక్రమ్ 2 కి ఏ స్థాయి వసూళ్లు వస్తాయో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.