Home Entertainment విక్రమ్ సినిమాలో సంతానం పాత్రని మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

విక్రమ్ సినిమాలో సంతానం పాత్రని మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

0 second read
0
1
221

లోకనాయకుడు కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 3న‌ విడుద‌లై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కమల్‌హాసన్‌కు చాలా కాలం తర్వాత సూపర్ హిట్‌ను అందించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ సినిమాను చేయ‌డంతో కమల్ అభిమానుల సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ పాత్ర‌లో ఐదు నిమిషాలు చేసినా.. అతడి పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

అటు విక్రమ్ సినిమాలో సంతానం అనే పాత్రలో విజయ్ సేతుపతి నటించి అందరినీ మెప్పించాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ నృత్య దర్శకులు ప్రభుదేవా, లారెన్స్‌లను సంప్రదించినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. కానీ వాళ్లిద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో సంతానం పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో లోకేష్ కనగరాజ్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించగా అతడు అంగీకరించాడు. సంతానం పాత్రలో విజయ్ సేతుపతి బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. ఒకవేళ ప్రభుదేవా లేదా లారెన్స్ చేస్తే సంతానం పాత్ర బాగా వచ్చేదో లేదో తెలియదు కానీ విజయ్ సేతుపతి మాత్రం అదరగొట్టాడు. అతడు గతంలో కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను పోషించాడు. తెలుగులోనూ ఉప్పెన వంటి సినిమాలో హీరోయిన్‌కు తండ్రిగా నటించి మార్కులు కొట్టేశాడు. సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలోనూ నటించాడు. తమిళంలోనూ వరుసగా మంచి పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఒకవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విజయ్ సేతుపతి రాణిస్తున్నాడు. దీంతో దర్శకులకు మంచి ఆప్షన్ అవుతున్నాడు.

కాగా విక్రమ్ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. తెలుగులో విక్ర‌మ్ చిత్రాన్ని హీరో నితిన్ విడుద‌ల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ.16.28 కోట్ల షేర్‌ను సాధించింది. తమిళంలో ఈ సినిమా రిలీజైన‌ నెల రోజుల్లోపే రూ.400 కోట్ల మార్కును సాధించ‌డం విశేషం. రజ‌నీకాంత్ నటించిన రోబో 2.0 త‌ర్వాత రూ.400 కోట్లు వ‌సూలు చేసిన రెండో తమిళ సినిమాగా విక్ర‌మ్ రికార్డు క్రియేట్ చేసింది. లేటెస్ట్‌గా ఈ చిత్రం బాహుబ‌లి పేరిట ఉన్న త‌మిళ రికార్డును బ్రేక్ చేసింది. విక్రమ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. అనిరుధ్ మ్యూజిక్. తెలుగులో అఖండ సినిమాకు తమన్‌కు బీజీఎం విషయంలో ఎంత పేరు వచ్చిందో.. తమిళంలో విక్రమ్ సినిమాకు అనిరుధ్‌కు అంతకంటే ఎక్కువ పేరు వచ్చిందనే చెప్పాలి. విక్రమ్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఓ హాలీవుడ్ సినిమా స్థాయి యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. కాబట్టి ఓటీటీలో చూడటం కంటే.. థియేటర్‌లో చూస్తేనే మంచి ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుందని అందరూ భావిస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…