Home Entertainment విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుర్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుర్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
3
40,407

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , స్వర్గీయ రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీ లో హీరో గా అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించి, గత జెనరేషన్ టాప్ 3 హీరోస్ లో ఒక్కరిగా సుమారు మూడు దశాబ్దాల పాటు చలన చిత్ర పరిశ్రమ ని ఏలాడు, కామెడీ అయినా సెంటిమెంట్ అయినా అద్భుతంగా పండించడం లో విక్టరీ వెంకటేష్ తర్వాతే ఎవ్వరైనా, ఒక్క ఒక్క ఫామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే మరో పక్క మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సమానమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక నటుడు విక్టరీ వెంకటేష్, ఇప్పటి వరుకు 72 సినిమాలు చేసిన వెంకటేష్ అధిక శాతం తన కెరీర్ లో 60 శాతం కి పైగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి, ఇటీవల ఆయన నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మెగాస్టార్ చిరంజీవి తర్వాత సీనియర్ హీరోస్ లో 100 కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ఏకైక సీనియర్ హీరో గా విక్టరీ వెంకటేష్ రికార్డు సృష్టించారు.

ఇక విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ఎంత సరదాగా ఉంటారో , బయట కూడా అంతే సరదాగా ఉంటారు, ఈ జనరేషన్ హీరోలు అందరూ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించడానికి ఎంతో ఇష్టపడుతుంటారు, పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ తో కలిసి ముల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసిన వెంకటేష్ , రామ్, వరుణ్ తేజ్ మరియు నాగ చైతన్య వంటి యువ హీరోలతో కూడా ముల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసాడు, ఒక్క మాటలో చెప్పాలి అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్ లో ముల్టీస్టార్ర్ర్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఆ ట్రెండ్ అలాగే కొనసాగి ఈరోజు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలు కూడా కలిసి మల్టీ స్టార్రర్ సినిమా చేస్తున్నారు అంటే అది వెంకటేష్ ఇచ్చిన స్ఫూర్తి అనే చెప్పొచ్చు, ఆరు పదుల వయస్సులో కూడా చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ల వరుకు థియేటర్స్ కి బారులు తీసేలా చేసే స్టార్ డమ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్.

ఇది ఇలా ఉండగా వెంకటేష్ తన ఫామిలీ ని మీడియా ముందుకి తీసుకొని రావడానికి పెద్దగా ఇష్టపడని సంగతి మన అందరికి తెలిసిందే, తన భార్య నీరజ ని కూడా వెంకటేష్ చాల అరుదుగా మీడియా ముందుకి తీసుకొచ్చారు , విక్టరీ వెంకటేష్ కి ముగ్గురు కూతుర్లు ఒక్క కొడుకు ఉన్నారు, కూతుర్ల పేరులు అర్షిత దగ్గుపాటి , భావన దగ్గుపాటి మరియు హయ వాహిని దగ్గుపాటి కాగా , కొడుకు పేరు అర్జున్ దగ్గుపాటి, వెంకటేష్ తన పెద్ద కూతురు అర్షిత దగ్గుపాటి కి గత ఏడాది అంగరంగ వైభవంగా జైపూర్ లో వినాయక్ రెడ్డి అనే అతనికి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆయన ముగ్గురు కూతుర్లు బంగారు బొమ్మల్లా ఉంటారు , వీళ్ళ అందం మేకప్ లేకుండానే టాలీవుడ్ హీరోయిన్స్ అందరూ నివ్వెరపోయేలా ఉంటుంది, వాళ్ళ ఫోటోలను మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు , ఇక వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుపాటి ని మనం ఇది వరకే చాల సందర్భాలలో చూసాము.

1

2

3

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రహ్మాస్త్ర మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

బాలీవుడ్ అగ్రతారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూప…