
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలకి ఎగబడి పోతుంటారు.60 ఏళ్ళు నిండిన ఇప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదు.ఇప్పటికి ఆయన సినిమాకి టాక్ వస్తే థియేటర్స్ అన్ని ఒక్క పండగ వాతావరణం లా కనిపిస్తాయి.అప్పట్లో ఇప్పట్లో సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఇచ్చేది ఒక్క విక్టరీ వెంకటేష్ మాత్రమే.ఈ జనరేషన్ హీరోలకి సరిసమానమైన కలెక్షన్లు రాబట్టే సత్తా మన వెంకటేష్ కి ఉంది.దానికి ఉదాహరణే గత ఏడాది విడుదల అయినా ఎఫ్ 2 సినిమా.ఈ మూవీ గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి.ఇంతతి బాక్స్ ఆఫీస్ స్టామినా ఉన్న వెంకటేష్ కి నట వారసుడు త్వరలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని ఫిలింనగర్ లో టాక్ అంతేకాదు ఏవైనా సినిమా ఆఫర్ ని సెలెక్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు.
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కొడుకు పేరు అర్జున్ సాధారణంగా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను ఎక్కువగా బయటపెట్టడానికి ఇష్టపడని వెంకటేష్ ఇటీవల కాలం లో అప్పుడప్పుడు తన అభిమానుల కోసం ఆయన ఫామిలీ ఫోటోలను పెడుతున్నాడు.అయితే ఇటీవల ఆయన కుమారుడు అర్జున్ ఫోటో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.హాలీవుడ్ హీరో ని మరిపించేలా ఉన్న ఈ కుర్రాడు అతి త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం చదువుకుంటున్న ఇతను చదువు పూర్తవగానే సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అట.తన కొడుకుని గ్రాండ్ వే లో ఇండస్ట్రీ లోకి లాంచ్ చేసి తానూ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలి అనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్టు సమాచారం.మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే అంతే కాదు వెంకటేష్ ఆగాల్సిందే అని చెబుతున్నాడు.
1
2
3
ఇక ఎఫ్ 2 మరియు వెంకీ మామ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న ఆ సినిమా తర్వాత చేసిన నారప్ప చిత్రం ఓటీటీ లో విడుదల అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, తమిళ్ లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా ధనుష్ ఆశారాం కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తమిళ్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది , ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 లోను అలాగే మలయాళం లో సూపర్ హిట్ అయినా మోహన్ లాల్ దృశ్యం 2 లోను నటిస్తున్నాడు, ఈ రెండు సినిమాల్లో దృశ్యం 2 ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా,ఎఫ్ 3 షూటింగ్ మాత్రం సెరవేగంగా సాగుతోంది, ఈ రెండు సినిమాల తర్వాత ఆయున త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం ఒక్క సినిమాలో నటించబోతున్నారు.ఇప్పటి వరుకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోయినా ట్రేడ్ లో మాత్రం ఈ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది,త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా కి ముందే వెంకటేష్ తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త,గతం లో త్రివిక్రమ్ కథ రచయితా గా వెంకటేష్ హీరో గా నటించిన సినిమాలు అన్ని సెన్సషనల్ హిట్ అయ్యాయి, వాటిల్లో మల్లీశ్వరి మరియు నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాల తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మల్లి అదే కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మావే పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.