
టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. నిజ జీవితంలో బాబాయ్, అబ్బాయ్‌లైన విక్టరీ వెంకటేష్, రానా ఎవరికి వారే విభిన్నంగా నటిస్తారు. రామానాయుడి కుమారుడిగా వెంకీ, సురేష్ బాబు తనయుడిగా రానా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. దృశ్యం, నారప్ప, ఎఫ్ 3 అంటూ వెంకీ తనకు సూటయ్యే పాత్రలను పోషిస్తూ దూసుకుపోతున్నాడు. అటు రానా విలన్‌గానే కాకుండా వైవిధ్యభరిత సినిమాలను అంగీకరిస్తూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత భీమ్లానాయక్‌లోనూ రానా విలన్‌గా నటించి తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం వెంకీ, రానా ఇద్దరూ కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా తెల్లజుట్టుతో కనిపించనున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ గురించి పక్కన పెడితే దగ్గుబాటి ఫ్యామిలీతో సమంతకు మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే ఆమె మాజీ భర్త నాగచైతన్య స్వయంగా వెంకటేష్‌కు మేనల్లుడు. అయితే చైతూతో సమంత విడిపోయిన తర్వాత ఆమెతో ఎలాంటి కాంటాక్టులు పెట్టు్కోవద్దని వెంకటేష్ రూల్స్ పెట్టినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతూతో సమంతకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తమకు కూడా ఎలాంటి రిలేషన్ షిప్ ఉండకూడదని వెంకీ ఇలా కండిషన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ రానా ఆ రూల్స్‌ను బ్రేక్ చేయడంతో వెంకటేష్ రానాపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఇటీవతల సమంత ఆరోగ్యం బాగోలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులోనూ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంతో నిజంగానే ఆమెకు హెల్త్ బాగోలేదా అంటూ రానా సమంతకు ఫోన్ చేసి పలకరించాడట. ఈ విషయం వెంకీ చెవిన పడటంతో అతడు హర్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది.
కాగా వెంకీ, రానా నటిస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. గతంలో రానా, వెంకటేష్ కలిసి కృష్ణం వందే జగద్గురుం అనే సినిమాలో ఓ పాటలో కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ టీజర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో రానా గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టాడు. వెంకటేష్ కూడా గుబురు గడ్డంతో తన ఏజ్‌కు తగ్గ పాత్రలో సాల్డ్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు. వెంకీ కొత్త మేకోవర్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. మొత్తంగా ఒకే స్క్రీన్‌పై బాబాయి, అబ్బాయిలను చూడాలనుకున్న అభిమానులకు ఈ వెబ్ సిరీస్ పండగే అని చెప్పాలి.