
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ వీర విహారం చేస్తూనే ఉంది..మెగా అభిమానులకు చెరిగిపోని జ్ఞాపకం గా మారిన ఈ సినిమా విజయోత్సవ సభ ఈ నెల 28 వ తారీఖున వరంగల్ లో జరగబోతుంది..ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి KTR కూడా హాజరు కాబోతున్నాడని టాక్..కచ్చితంగా ఈ విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందే..68 ఏళ్ళ వయస్సులో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న హీరో కి అభిమానులు ఎంత సంబరాలు చేసుకున్న అది తక్కువే అవుతుంది..అది కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత చరిత్రలో మర్చిపోలేని విజయం.
కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు..ఇక రెండవ వారం లో కూడా అదే జోరు అదే ఊపు..దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది..ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలలో ఈ సినిమాకి వసూళ్ల ప్రవాహం ఎప్పుడు ఆగుద్దో ట్రేడ్ పండితులు సైతం చెప్పలేకున్నారు..కేవలం ఆ రెండు ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఇందులో ఉత్తరాంధ్ర లో 18 కోట్లు కాగా..ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల రూపాయిలు..మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి దిగితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో లేస్తాయో చెప్పడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ..కంటెంట్ పరంగా తీసుకుంటే ఈ సినిమా యావరేజి అని చెప్పాలి..కేవలం మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా తో నిలబడింది..అందులో రవితేజ సహకారం కూడా ఉంది అనుకోండి అది వేరే విషయం.
ఇక నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో కూడా ఈ సినిమా దుమ్ము లేపేసింది..నైజాం లో 34 కోట్ల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక మెగాస్టార్ అడ్డా రాయలసీమ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన సైరా చిత్రానికి ఇక్కడ 19 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..మరి ‘వాల్తేరు వీరయ్య’ సైరా రికార్డుని కొడుతుందో లేదో చూడాలి..మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు 128 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఫుల్ రన్ లో ఎంత దాకా లాగుతుందో చూడాలి.