Home Entertainment ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బయ్యర్లు కరువు..’వీరసింహ రెడ్డి’ బిజినెస్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది

‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బయ్యర్లు కరువు..’వీరసింహ రెడ్డి’ బిజినెస్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది

0 second read
0
0
166

ఓడలు బండ్లు అవుతాయి..బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు చెప్పే సామెత ఒక్కోసారి ఎంత కరెక్టుగా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థం అవుతుంది..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లను ఈ సామెతకి ఉదాహరణగా తీసుకోవచ్చు..మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టేటస్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నిన్న మొన్నటి వరుకు ఆయనతో నేటి తరం స్టార్ హీరోలే పోటీ పడలేని రేంజ్ లో ఆయన స్థానం ఉండేది..రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహారెడ్డి వంటి చిత్రాలు బ్యాక్ 2 బ్యాక్ వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించాయి..ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని ఇప్పటి వరుకు చాలా మంది స్టార్ హీరోలు దాటలేదు కూడా..అలాంటి స్టార్ స్టేటస్ మన మెగాస్టార్ చిరంజీవి సొంతం..కాని గత రెండు చిత్రాలు ఆయన మార్కెట్ ని మొత్తం బాగా డౌన్ చేసాయి..భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికి తెలిసిందే.

ఈ చిత్ర ప్రభావం మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ పై చాలా తీవ్రంగా పడింది..డిస్ట్రిబ్యూటర్స్ ఆయన సినిమాలను కొనాలంటే భయపడే రేంజ్ ఫ్లాప్ అయ్యింది ఆ చిత్రం..ఆ తర్వాత రెండు నెలల క్రితం విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఆచార్య ఫ్లాప్ వల్ల తక్కువ రేట్స్ కి ఈ సినిమా బిజినెస్ ని చేసారు..కాని అది కూడా రికవర్ చేయలేకపోవడం తో చిరంజీవి మార్కెట్ స్లంప్ అయ్యిందా..లేదా రీమేక్ చెయ్యడం వల్ల ఎఫెక్ట్ పడిందా అనే సందిగ్ధం లో ట్రేడ్ వర్గాలు పడేలా చేసాయి..ఈ రెండు సినిమాల ఫలితం ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మీద పడింది..ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మరో స్టార్ హీరో రవితేజ కూడా ఉన్నాడు..ఇప్పటి వరుకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగుంది..కాని మెగాస్టార్ గత చిత్రాల ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా బిజినెస్ కొన్ని ప్రాంతాలలో ఇంకా క్లోజ్ అవ్వలేదు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు జరుగుతుందని అంచనా వేస్తే, ఇప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలకు మాత్రమే పలుకుతుందట..సోలో రిలీజ్ కాదు కాబట్టే బయ్యర్స్ ధైర్యం చేయట్లేదట..ఓవర్సీస్, నైజం ,సీడెడ్ వంటి ప్రాంతాలలో ఇప్పటికే బిజినెస్ క్లోజ్ అవ్వగా..కోస్తాంధ్ర బిజినెస్ మాత్రం ఇంకా ఓపెన్ లోనే ఉంది..నిర్మాతలు ఫ్యాన్సీ ప్రైజ్ అడగడం తో డిస్ట్రిబ్యూటర్స్ అంత ఇవ్వడానికి జంకుతున్నారట..కేవలం కోస్తాంధ్ర ప్రాంతం నుండి ఈ సినిమాకి నిర్మాతలు 55 కోట్ల రూపాయిలు ఆశిస్తున్నారు..కాని 45 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నట్టు ట్రేడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..ఇంకా ఈ డీల్ చర్చల్లోనే ఉంది..మరోపక్క బాలయ్య బాబు అఖండ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉండడం వల్ల ‘వీర సింహ రెడ్డి’ బిజినెస్ చిరంజీవి సినిమాకంటే ముందుగా బిజినెస్ ని క్లోజ్ చేసుకున్నట్టు సమాచారం..ప్రపంచవ్యాప్తంగా ఈ థియేట్రికల్ రైట్స్ 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది..చిరంజీవి మొదటి రోజు కలెక్షన్స్ అంత కూడా విలువ చెయ్యని బాలయ్య బాబు మూవీ క్లోసింగ్ మార్కెట్ ఇప్పుడు చిరంజీవి తో సరిసమానంగా తన సినిమాకి బిజినెస్ ని చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…