Home Entertainment ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్ల ప్రభంజనం పై బాలయ్య షాకింగ్ కామెంట్స్

‘వాల్తేరు వీరయ్య’ వసూళ్ల ప్రభంజనం పై బాలయ్య షాకింగ్ కామెంట్స్

0 second read
0
0
10,627

టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పాలి. గతంలో ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అని పోటీ పడిన వీరిద్దరూ.. ఈ సంక్రాంతికి చాలా ఏళ్ళ తర్వాత ఒకేసారి బరిలోకి దిగారు. దీంతో ఈ ఫెస్టివల్ సీజన్ మరింత స్పెషల్‌గా ఉంటుందని ముందు నుంచే అందరూ భావించారు. భారీ అంచనాల నడుమ ఒకరోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు, ఒకే విధమైన టాక్ ని సొంతం చేసుకున్నాయి. కానీ వసూళ్ళలో వ్యత్యాసం చూపించాయి. ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్స్‌ను బట్టి ఈ బాక్సాఫీస్ వార్‌లో చిరు విన్నర్‌గా నిలిచినట్లుగా పేర్కొంటున్నారు. ఇకపోతే వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా రెండూ మంచి విజయం సాధించాలని.. నిర్మాతలకు మంచి లాభాలు రావాలని చిరంజీవి కోరుకున్నారు.

పాతికేళ్ల క్రితం ఒకేసారి విడుదలైన హిట్లర్, పెద్దన్నయ్య సినిమాల మాదిరిగా అదే ఫలితాలు పునరావృతం అవుతాయని.. రాసిపెట్టుకోండి అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. ఇటీవల బాలయ్య సైతం ఓ ఇంటర్వ్యూలో సంక్రాంతి పోటీపై స్పందించారు. ఏ రంగంలో అయినా పోటీ అనేది అవసరమని.. పోటీ లేనిదే ఫలితాలు ఆశాజనకంగా ఉండవని పేర్కొన్నారు. మరోవైపు వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడంపై బాలకృష్ణ మాట్లాడుతూ.. చరిత్రలోనే మొదటిసారిగా ఒకే నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి పోటీ పడుతున్నాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవడం వలన ఇండస్ట్రీ బాగుంటుందని.. పున్నమి చంద్రుడిలా ఇండస్ట్రీ ఒక వెలుగు వెలుగుతుందని బాలయ్య పేర్కొన్నారు. రెండు సినిమాలు విడుదల కావడం అనేది ఈ పండక్కి తెలుగు వారికి పంచభక్ష పరమాణ్ణం అందించినట్లే అని అన్నారు. అటు వాల్తేరు వీరయ్య భారీ వసూళ్లు సాధిస్తుండటంతో తన సహచర నటుడు మెగాస్టార్‌కు బాలయ్య కంగ్రాట్స్ చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి మాస్ యాక్షన్ సినిమాలు ఒకేసారి పోటీ పడిన తరుణంలో సోషల్ మీడియాలో మెగా- నందమూరి వర్గాల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే.. మా సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మేకర్స్ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. అంతేకాకుండా సక్సెస్ మీట్ నిర్వహించారు. తాజాగా కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించారు. బాలయ్య సినిమా 5 రోజుల్లో 104 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. చిరంజీవి చిత్రం 4 రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్స్ వదిలారు. దీంతో ఈ సంక్రాంతికి మెగాస్టార్ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచారని స్పష్టమవుతోంది. వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తుండంతో బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…