Home Entertainment ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ ఆగిపోనుందా..? జగన్ సర్కార్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా!

‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ ఆగిపోనుందా..? జగన్ సర్కార్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా!

1 second read
0
0
1,710

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 8న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర యూనిట్ తలపెట్టింది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రోడ్ షోలు, సభలు, ఈవెంట్లు నిర్వహించకూడదు. దీంతో విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని భావించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ పడింది. ఆర్కే బీచ్ లో స్టేజ్ పనులు జరుగుతుండటంతో గురువారం అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ పనులు నిలిపివేయాలని కోరారు. అధికారుల సూచనల మేరకు వెంటనే పనులు నిలిపివేయాల్సిందిగా పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు నిలిచిపోయాయి. త్వరలోనే ఈ వేడుకకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు రానున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా కుటుంబానికి చెందిన కొందరు కూడా రావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశాఖపట్నం కేంద్రంగానే వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కించారు. విశాఖపట్నంలోని వాల్తేరు ప్రాంతం నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి యూనిట్ అయితే ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‌కు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి కూడా మెగా అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉండడంతో పోలీసులు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ తొలిసారిగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. చిరంజీవి ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. గతంలో ఎన్నో సినిమాల్లో చిరు డబుల్ యాక్షన్ చేశాడు. తొలిసారి బిర్లా రంగా, బందిపోటు సింహం, రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు, ఖైదీనంబర్ 150 సినిమాల్లో తండ్రీకొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాల్లో స్నేహం కోసం, ఖైదీనంబర్ 150 సినిమాలు సక్సెస్‌లను అందించాయి.

ఈ నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి మరోసారి తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలియడంతో అభిమానులు కలవరపడుతున్నారు. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా ఉంది. మొత్తంగా ఈ సినిమా నిడివి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాను బాబీ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కించాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత చిరు నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మాస్‌ను అలరిస్తున్నాయి. ఈ సినిమాను యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అటు చిరంజీవి తన 44 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 150కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో అలరించాడు. అందులో కొన్ని సినిమాల్లో ఒకటి కంటే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాడు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రాభినయం చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…