
సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సైరా నరసింహారెడ్డి తర్వాత చిరు కెరీర్‌లో మరో హిట్ మూవీ చేరింది. అంతేకాకుండా 2023లో క్లీన్ హిట్‌గా నిలిచిన తొలి మూవీ కూడా వాల్తేరు వీరయ్య కావడం గమనించాల్సిన విషయం. ఈ మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అటు తొలివారం ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ రూ.107 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ కెరీర్‌లో మరో రూ.100 కోట్ల మూవీ చేరింది.ఈ సినిమాకు రూ.88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో తొలివారంలోనే లాభాల బాట పట్టింది. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ చిరు సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ ఎంటర్ టైనర్ కావడంతో వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. అటు సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల కన్నా భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ కలెక్షన్లతో చిరు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగా పర్ఫామ్ చేస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా చిరంజీవి మీదే నడుస్తుందనుకున్నా.. రవితేజ తనదైన ముద్రతో మెగా అభిమానులను సైతం మెప్పించాడు. డైరెక్టర్ బాబి స్టోరీ రాసుకునేటప్పుడే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన హీరో రవితేజను ఈ సినిమాలో పెట్టాలని అనుకున్నాడట. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయడంతో పాటు రవితేజ కూడా మెగా అభిమాని అవడంతో ఈజీగా ఒప్పుకోవడం జరిగిందట. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 తో మెగా రీ ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోసారి ఐదేళ్ల తర్వాత వాల్తేరు వీరయ్య మూవీతో రూ.100 కోట్ల సినిమాను చిరు అందించాడు.
కాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేర్లు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వీరు హీరోలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. అయితే బాలయ్య మూవీ కంటే సంక్రాంతి పండగ మెగాస్టార్ చిరంజీవికి, మైత్రీ మూవీ మేకర్స్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు.ఒకరోజు తేడాతో రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అభిమానులు సైతం ప్రెష్టేజ్‌గా ఫీల్ అయ్యారు. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టేలా చేయాలని భావించారు. అయితే ప్రేక్షకులు మాత్రం వాల్తేర్ వీరయ్యకే పట్టం కట్టారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే వీరసింహారెడ్డి సినిమాలో యాక్షన్ సీన్స్ తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం. సైకలాజికల్ ప్రకారం కేవలం ఒక వర్గానికి మాత్రమే ఆకట్టుకుంది. చిరు నటించిన వాల్తేరు వీరయ్య మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను అలరించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది.