
కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి ఆట నుండే ప్రారంభమైన కలెక్షన్స్ ఊచకోత, నిన్న రాత్రి వరకు ప్రదర్శించిన ఆటలతో మెగాస్టార్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా 90 శాతం కి పైగా ఆక్యుపెన్సీ తో ప్రదర్శించబడింది..ఈమధ్య కాలం లో ఈ రేంజ్ ఆక్యుపెన్సీ తో ప్రదర్శించబడ్డ ఏకైక చిత్రం ఇదే..హైదరాబాద్ సిటీ నుండి తెలంగాణ మారుమూల ప్రాంతం వరకు ఈ సినిమా నిన్న హెవీ రిటర్న్స్ తో దంచి కొట్టేసింది..కొన్ని ప్రాంతాలలో అయితే థియేటర్స్ లో సీట్స్ సరిపోక అదనపు కుర్చీలను వేశారు..సాధారణంగా ఇలాంటి హెవీ రిటర్న్స్ సంక్రాంతి పండుగ రోజు వస్తాయి..కానీ సంక్రాంతికి రెండు రోజుల ముందే ఇలాంటి వసూళ్లు వచ్చాయంటే, ఇక పండుగ రోజు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక ఈ సినిమాకి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే , మొదటి రోజు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చిందని సమాచారం..విడుదలైన అతి తక్కువ థియేటర్స్ తో ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు..సోలో రిలీజ్ దొరికి ఉంటే కచ్చితంగా పది కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇక సీడెడ్ లో కూడా ఇదే పరిస్థితి..మొదటి రోజు ఎక్కువ థియేటర్స్ దొరకలేదు..అందువల్ల ఈ చిత్రానికి అక్కడ 5 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఇది సెన్సేషనల్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు కానీ సోలో గ్రౌండ్ దొరికి ఉంటే నాన్ #RRR రికార్డు గా నిలిచేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..ఈ రెండు ప్రాంతాల తర్వాత మెగాస్టార్ ఊర మాస్ బ్యాటింగ్ చేసిన ప్రాంతం కోస్తాంధ్ర.
వైజాగ్ , ఈస్ట్ , వెస్ట్ , గుంటూరు , కృష్ణ మరియు నెల్లూరు జిల్లాలలో ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే..మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి, రెండవ రోజు నుండి భారీ స్థాయిలో షోస్ పెంచేశారు..మొదటి రోజు తో సమానంగా ఉదయం ఆటలు విచ్చలవిడిగా వేసేసారు..అలా రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకి మొదటి రోజు 23 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి..ఓవర్సీస్ లో కూడా ఇదే రేంజ్ బ్యాటింగ్..కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజు నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ వచ్చాయి..అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట..అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.