
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ప్రముఖ డైరెక్టర్ బాబీ తెరెక్కించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది..’ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ వంటి నిరాశాజనకంగా సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..ఎందుకంటే టీజర్, ట్రైలర్ మరియు పాటలు ప్రతీ ఒక్కటి కూడా అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో ఉన్నాయి..కేవలం అభిమానులకు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా బాగా నచ్చింది..అందుకే ఈ మూవీ పై అంచనాలు ఆ రేంజ్ లో పెరిగాయి..రెండు ఫ్లాప్స్ పడిన తర్వాత కూడా వంద కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి కూడా కారణం అదే..మరి అంత అంచనాలను ఏర్పర్చిన ఈ సినిమా, అభిమానులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
డైరెక్టర్ బాబీ టైటిల్ కార్డు నుండే తాను మెగాస్టార్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది నిరూపించుకున్నాడు..పాత సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి అని ఎంత స్టైలిష్ గా టైటిల్ కార్డు పడేదో అదే టైటిల్ కార్డు ని ఈ సినిమాకి కూడా వాడాడు..ప్రారంభం లో మొదటి 15 నిమిషాల ఎపిసోడ్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అని మనకి అర్థం అయిపోతుంది..ఆ తర్వాత బాస్ పార్టీ సాంగ్ కి థియేటర్ లో ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా సీట్ మీద కూర్చోడు..మెగాస్టార్ నుండి ఇలాంటి మాస్ డ్యాన్స్ చూసి ఎంత కాలం అయ్యిందో అని అందరు ఆనంద బాష్పాలు రాలుస్తారు..అలా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది..చిరంజీవి లోని తన వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకి తీసుకొని రావడం లో డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..సాంగ్స్ లో డ్యాన్స్ కూడా ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ రేంజ్ లో వేసింది ఈ సినిమాలోనే.
ఇక సెకండ్ హాఫ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి..మాస్ మహారాజ రవితేజ వచ్చేది సెకండ్ హాఫ్ నుండే..ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన ఇరగదీశాడనే చెప్పాలి..సెకండ్ హాఫ్ మొత్తం చిరంజీవి – రవితేజ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంటుంది..కానీ చివరికి ఏమైంది..వీళ్లిద్దరు కలుస్తారా లేదా అనేదే తెరమీద చూడాల్సిందే..ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది..అలా అన్ని విధాలుగా ఈ సినిమా అభిమానులను ప్రేక్షకులను అలరించింది..సంక్రాంతికి ఎలాంటి సినిమా కావాలని మన అందరం కోరుకుంటామో..అలాంటి సినిమానే వచ్చేసింది..ఇక బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.