Home Entertainment వామ్మో..13 వారాలకు గాను ఫైమా కి బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వామ్మో..13 వారాలకు గాను ఫైమా కి బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0 second read
0
1
3,614

బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టిన రోజు నుండి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ఓట్లను బాగా దక్కించుకున్న ఫైమా..ఆ తర్వాత తన వెటకారం కారణంగా టైటిల్ గెలుచుకునే అవకాశాలను మెల్లగా పోగొట్టుకుంటూ వచ్చింది..ఫిజికల్ టాస్కులు బాగానే ఆడినప్పటికీ ఈమెని ఆడియన్స్ ప్రోత్సహించలేదు..గత వారమే అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఈమె..కానీ లక్కీ గా ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ఉండడం తో ఆమె ఎలిమినేషన్ ని చాలా తేలికగా తప్పించుకుంది..ఆమె బదులు పాపం రాజ్ ఎలిమినేట్ అయ్యాడు..ఇక ఈ వారమైన చక్కగా ఆడి తన గ్రాఫ్ ని పెంచుకునే ప్రయత్నం చేసిందా అంటే లేదు..నామినేషన్స్ సమయం లో రేవంత్ ని టార్గెట్ చెయ్యడమే పనిగా పెట్టుకుంది..అతనిని జనాలకు బ్యాడ్ ప్రాజెక్ట్ చెయ్యాలని చూసి చివరికి హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది పాపం..ఇది ఇలా ఉండగా 13 వారాల పాటుగా హౌస్ లో కొనసాగినందుకు గాను బిగ్ బాస్ టీం ఆమెకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఫైమా కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే జబర్దస్త్ కమెడియన్ గా ఆమెకి మంచి పాపులారిటీ ఉంది..ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఒకరిద్దరు మినహా మిగిలిన ఇంటి సభ్యులెవ్వరు కూడా హౌస్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు..ఆ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఫైమా కూడా ఒకరు..ఈమెకి రెమ్యూనరేషన్ గట్టిగానే ఇస్తారని అందరూ అనుకున్నారు..కానీ ఆమెకి వచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే అయ్యో పాపం అని అనకుండా ఉండలేరు..13 వారాలకు గాను ఆమెకి కేవలం 3 లక్షల 25 వేల రూపాయిలు మాత్రమే ఇచ్చారట..అంటే వారానికి ఆమెకి 25 వేలు రూపాయిలు అన్నమాట..ఇది చాలా తక్కువ అనే చెప్పాలి..గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ అందరికి ఒక్క రోజు ఇచ్చే రెమ్యూనరేషన్ అది..ఇప్పుడు వారానికి ఇవ్వడానికే అంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ సీజన్ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం అయిపోతుంది..ఒక్క ఫైమా కి మాత్రమే కాదు అందరి కంటెస్టెంట్స్ కి ఇదే పరిస్థితి.

ఈ మాత్రం దానికి వీళ్ళందరూ వాళ్ళ వృత్తులను వదులుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి కెరీర్ ని నాశనం చేసుకోవడం ఎందుకు..ఇప్పుడు ఫైమా జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది..ఎందుకంటే ఒక్కసారి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి బయటకి అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చే దానికి లేదు..చంటి పరిస్థితి అలాగే అయ్యింది మరియు ముక్కు అవినాష్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది..పాపం అవినాష్ పరిస్థితి అయితే మరీ దారుణం..బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ లేదు..వేరే చోట్ల అవకాశాలు కూడా లేవు..అలాంటి పరిస్థితి లో అప్పు ఇచ్చినోళ్ల గోడు భరించలేక ఆత్మహత్య చేసుకునే సందర్భం కూడా వచ్చిందట..శ్రీముఖి తనని ఆర్థికంగా ఆదుకోవడం తో అవినాష్ ఈరోజు మన ముందు ఇలా ఉన్నాడు..పాపం ఫైమా పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి ఇక.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…