
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకడు దిల్ రాజు..ఇతగాడు ఎదిగిన తీరుని చూసి ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి..ఒక చిన్న ఆటోమొబైల్ షాప్ ని నడుపుకుంటూ జీవనం సాగిస్తుందే దిల్ రాజు, అనుకోకుండా సినీ పరిశ్రమకి రావడం, డిస్ట్రిబ్యూటర్ అవ్వడం అలా అన్నీ చకచకా జరిగిపోయాయి..డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కి ప్రారంభం లో గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి..కానీ స్థిరంగా నిలబడ్డాడు..తొలిప్రేమ సినిమా నైజాం రైట్స్ ని కొన్నాడు..ఆ సినిమా సంచలన విజయం సాధించడం తో అందులో వచ్చిన డబ్బులను పెట్టి దిల్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు..ఆ సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దిల్ రాజుకి, ఆ సినిమాతో ప్రారంభమైన దిల్ రాజు జైత్ర యాత్ర నేటికీ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా విజయవంతంగా ఆయన సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
ఇక దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే అనిత అనే అమ్మాయిని పెళ్లాడాడు..అయితే దురదృష్టం కొద్దీ ఆమె 2017 వ సంవత్సరం లో గుండె పోటు తో మరణించింది..ఇక ఆ తర్వాత 2020 వ సంవత్సరం లో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడాడు..ఇప్పుడు వీళ్లిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు..అయితే వీళ్లిద్దరు కలిసి మొట్టమొదటిసారి ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ లో తేజస్విని దిల్ రాజు తో పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పుకొచ్చింది..ఆమె మాట్లాడుతూ ‘నేను ఎయిర్ వే లైన్స్ లో పని చేస్తూ ఉంటాను..ఆ తర్వాత నేను అమెరికా కి వెళ్లి PHD చెయ్యాలి అనుకున్నాను..నేను అక్కడ పనిచేస్తున్న సమయం లోనే దిల్ రాజు తరుచూ ఫ్లైట్ ప్రయాణం చేస్తుండేవాడు..సరిగ్గా నా షిఫ్ట్ సమయం లోనే ఆయన వస్తుండేవారు..అలా ఒకరోజు ఆయన అమెరికా కి వెళ్తున్నాడు..ఎదో అవసరం వచ్చి నా దగ్గర పెన్ తీసుకున్నాడు..అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది..తరుచు ఆయన కలుస్తుండేవారు’ అని చెప్పుకొచ్చింది తేజస్విని.