
ప్రస్తుతం టాలీవుడ్ తీవ్రమైన కష్టాల్లో ఉంది..వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన తర్వాత వచ్చిన మీడియం రేంజ్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలుగా నిలిచాయి..నిర్మాతలు కూడా ఇలాంటి వసూళ్లను కలలో కూడా ఊహించి ఉండరు..అందుకే స్వచ్చందం గా వాళ్ళు షూటింగ్స్ నిలిపివేతకు పిలుపుని ఇచ్చారు..ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కోలుకోవడానికి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఉండాలి..అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉన్న ఏకైక సినిమా విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ చిత్రం..పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..సినిమాకి కావాల్సిన హైప్ అయితే బాగా క్రియేట్ అయ్యింది..అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే లైగర్ సినిమా స్టోరీ పూరి జగన్నాథ్ తొలుత విజయ్ దేవరకొండ కోసం రాసుకోలేదట..ఈ చిత్రాన్ని తొలుత ఆయన ఒక స్టార్ హీరో తో చేద్దామని అనుకున్నాడట..అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి వారికి ఈ కథని అప్పట్లో వినిపించాడట..అయితే అప్పట్లో ఈ హీరోల డేట్స్ ఖాళి లేకపోవడం తో ఈ కథని తాత్కాలికంగా పక్కన పెట్టాడట పూరి జగన్నాథ్..ప్రభాస్ ఈ సినిమాకి ఓకే చెప్పినప్పటికీ కూడా ఎందుకో సెట్స్ మీదకి మాత్రం వెళ్ళలేదు..ఇక చూసి చూసి స్టార్ హీరో రేంజ్ ఇమేజి ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో సెట్ చేసుకున్నాడు ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్..ప్రముఖ హీరోయిన్ ఛార్మి తో కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తన సొంత డబ్బులతో నిర్మించాడు..సినిమా బాగా వచ్చిందట..మూవీ యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం..అయితే ఈ సినిమాని ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి వారు మిస్ చేసుకొని తప్పు చేశారే అనే ఫీలింగ్ కలిగించే రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది చూడాలి.
ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటించగా విలన్ గా ప్రముఖ బాక్సర్ మైక్ టైజన్ నటించాడు..ఆయన ఇండియా లో నటించిన ఏకైక చిత్రం ఇదే అవ్వడం విశేషం..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి తల్లి గా ప్రముఖ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించింది..అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో..ఈ సినిమా కూడా ఆయన కెరీర్ ని మలుపు తిప్పే విధంగా ఉంటుంది అని పూరి జగన్నాథ్ గట్టి నమ్మకం తో ఉన్నాడు..పూరి జగన్నాథ్ టేకింగ్ ఎంతగానో నచ్చి విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం కూడా పూరి జగన్నాథ్ తోనే చేస్తున్నాడు..ఈ సినిమా పేరు జన గణ మన..సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒకప్పుడు చెయ్యాలనుకున్న సినిమా ఇది..ఇప్పుడు విజయ్ దేవర కొండా ఆ సినిమా చేస్తుండడం తో ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.