
ఈ ఏడాది లో విడుదలకి ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా..టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేపిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో దారుణంగా విఫలమైంది..మొదటి ఆట నుండే ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది..ట్విట్టర్ లో అప్పుడే ఈ సినిమా మీద ట్రోలింగ్స్ వెయ్యడం ప్రారంభించారు..పూరి జగన్నాథ్ పైత్యానికి పరాకాష్ట లాగ ఈ సినిమా ఉందని..అతని మానసిక స్థితి నిజంగానే బాగుందా?, స్టోరీ రాసాక సినిమా తీస్తాడా..సినిమా తీసాక స్టోరీ రాస్తాడా..పోకిరి , ఇడియట్, బద్రి , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, టెంపర్ ఇలా టాలీవుడ్ లో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినా సినిమాలు అందించిన పూరి జగన్నాథ్ గారినే ఈ సినిమాకి దశకత్వం వహించింది అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది.
ఒకసారి ఈ సినిమా కథ ఎలా ఉందొ చూద్దాం..హీరో విజయ్ దేవరకొండ రమ్య కృష్ణ మరియు మైక్ టైసన్లకు పుట్టిన ఏకైక బిడ్డ..మైక్ టైసన్ ఇండియా కి వచ్చిన సమయం లో రమ్య కృష్ణ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిన తర్వాత ఆమెని మోసం చేసి విదేశాలకు తిరిగి వెళ్ళిపోతాడు..ఇక ఆ తర్వాత రమ్య కృష్ణ విజయ్ దేవరకొండ ని తీసుకొని కరీం నగర్ కి వెళ్లి జీవనం కొనసాగిస్తుంది..విజయ్ దేవరకొండ కి బాల్యం నుండే ఒక పెద్ద ఫైటర్ అవ్వాలని కోరిక..అందుకోసం తన తల్లి తో కలిసి ముంబై వెళ్తాడు..బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటాడు..ఆలా సాగుతున్న విజయ్ దేవరకొండ జీవితం లోకి మైక్ టైసన్ వస్తాడు..ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏమి జరుగుతుంది అనేదే స్టోరీ..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన పాత్రకి నూటికి నూరుపాళ్లు న్యాయం చెయ్యడానికే కష్టపడ్డాడు..కానీ పూరి జగన్నాథ్ టేకింగ్ పరమ రోతగా ఉండడం తో సినిమాని కాపాడలేకపొయ్యాడు విజయ్ దేవరకొండ.
అంతే కాకుండా నత్తి యాక్టింగ్ విజయ్ దేవరకొండ కి అసలు సూట్ కాలేదు..కానీ పాపం ప్రయత్నం అయితే గట్టిగానే చేసాడు..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు..సినిమాకే ఈమె పెద్ద మైనస్..మైక్ టైసన్ అసలు ఈ పాత్ర లో నటించడానికి ఎలా ఒప్పుకున్నాడో ఇప్పటికి అర్థం కాదు..పోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా అద్భుతంగా ఉందా అంటే అదీ లేదు..చాలా సినిమాలు కంటెంట్ లేకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల యావరేజి స్టేటస్ కి వెళ్ళినవి ఉన్నాయి..కానీ ఈ సినిమాకి ఆ ఛాన్స్ లేదు..పూరి జగన్నాథ్ కి వచ్చిన అద్భుతమైన ఛాన్స్ ని ఈ సినిమా ద్వారా మిస్ చేసుకున్నాడు..విజయ్ దేవరకొండ కి నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాని పూరి జగన్నాథ్ కరెక్టు గా తీసి ఉంటె విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం మాములుగా ఉండేది కాదు..కానీ బాడ్ లక్..తర్వాత సినిమాతో నైనా ఆయన పాన్ ఇండియా ఎంట్రీ భారీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.