Home Entertainment లైగర్ మూవీ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..ఇది మాములు అరాచకం కాదు

లైగర్ మూవీ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..ఇది మాములు అరాచకం కాదు

0 second read
0
0
297

విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది..ఈ సినిమా కి విడుదలకు ముందు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ హీరో రేంజ్ లో 90 కోట్ల రూపాయలకు జరిగింది..ఈ స్థాయి లో ఒక మీడియం రేంజ్ హీరో కి రావడం అంటే మాటలు కాదు..అంతలా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డిజాస్టర్ టాక్ రావడం తో ఇప్పుడు ఈ సినిమా ఎంత నష్టాలను పెడుతుందో అని బయ్యర్స్ కంగారు పడుతున్నారు..కానీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ నుండే స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ ని తలపించిన ఈ సినిమా టాక్ సరిగా రాకపోయినా కూడా స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది..ఈ సినిమాకి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ అని చెప్పక్క తప్పదు..అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం హైదరాబాద్ సిటీ లోనే ఈ సినిమాకి నాలుగు కోట్ల రూపాయిలు గ్రాస్ వచ్చింది అంటే మాములు విషయం కాదు..పవన్ కళ్యాణ్,మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి హీరోలకు ఇలాంటి గ్రాస్ నంబర్స్ వస్తుంటాయి..కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఒక్క మీడియం రేంజ్ హీరో కి అలాంటి ఓపెనింగ్ ని చూస్తున్నాము..మొదటి రోజు మొత్తం పూర్తి అయ్యేసరికి ఈ సినిమా కేవలం నైజం ప్రాంతం నుండే 8 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తుందని అంచనా..ఈ ఏడాది లో టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు..ఆచార్య సినిమా నైజం ప్రాంతం లో మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..లైగర్ కూడా అదే రేంజ్ లో వసూలు చేస్తుందని అంచనా.

ఇక ఈ సినిమాకి ఆంధ్ర ప్రాంతం లో కూడా ఓపెనింగ్స్ పగిలిపోయాయి..ఎర్లీ మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ సినిమాకి ప్రతి సెంటర్ లో స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ దక్కింది..ఆంధ్ర ప్రదేశ్ లో సీడెడ్ ప్రాంతం ని కలుపుకొని ఈ సినిమాకి కేవలం మొదటి రోజు నుండే 14 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉంది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేయబోతుంది ఈ సినిమా..ఇక అమెరికా లో ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ నుండే 5 లక్షల డాలర్లు వసూలు చేసింది..మొత్తం మీద ప్రీమియర్స్ + మొదటి రోజు కలిసి ఈ సినిమాకి 7 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి..సినిమాకి క్రేజ్ ఉంది కాబట్టి టాక్ లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులు బలంగా ఆడేస్తది అని చెప్పొచ్చు..కానీ ఆ తర్వాత రన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…