
ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు..యావత్తు భారత దేశ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా..భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లోనూ మరియు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది..యూత్ లో యమ క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకి మార్కెట్ లో మాములు డిమాండ్ లేదనే చెప్పాలి..ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకు జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటి వరుకు స్టార్ హీరోలకు తప్ప వంద కోట్ల రూపాయిల బిజినెస్ మీడియం రేంజ్ హీరోలకు జరగలేదు..అలాంటిది విజయ్ దేవరకొండ కి ఆ రేంజ్ బిజినెస్ జరిగింది అంటే ఆయన లెవెల్ టయర్ 2 నుండి టయర్ 1 వెళ్ళినట్టే అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.
ఈ నెల 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకున్నాయి..సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి 7 కట్స్ విధించారు..అలాగే కొన్ని బూతులతో కూడిన డైలాగ్స్ ని మ్యూట్ చేసారు..పూరి జగన్నాథ్ సినిమా అంటే అలాంటివి ఉండడం సర్వసాధారణం అనే విషయం మనకి తెలిసిందే..ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే 2:20 గంటలు వచ్చిందట..ఇటీవల కాలం లో ఈ లెంగ్త్ రన్ టైం తో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి..ఇప్పుడు లైగర్ కూడా అదే రేంజ్ లో హిట్ కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు విజయ్ దేవరకొండ అభిమానులు..అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ టాక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది..ఆ టాక్ చూస్తే టాలీవుడ్ కి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అర్థం అయిపోతుంది.
ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఈ చిత్రం పూరి జగన్నాథ్ కెరీర్ లో మరో ‘అమ్మా నానా ఓ తమిళమ్మాయి’ రేంజ్ భారీ హిట్ అవుతుందని చెప్తున్నారు..అంతే కాకుండా ఈ సినిమా విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేస్తుందట..పూరి జగన్నాథ్ ఆయన పాత్రని అంత అద్భుతంగా తీర్చి దిద్దారట..తల్లి సెంటిమెంట్ అదిరిపోయిందని టాక్..అంతే కాకుండా ఈ సినిమాకి సెకండ్ హాఫ్ గుండె లాంటిదట..ఇటీవల విడుదలైన అన్ని బ్లాక్ బస్టర్ సినిమాల సెకండ్ హాఫ్ కంటే లైగర్ మూవీ సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది..చూడాలిమరి సెన్సార్ నుండి వచ్చిన ఈ రేంజ్ పాజిటివ్ టాక్, ప్రేక్షకుల నుండి కూడా వస్తుందా లేదా అనేది..ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది..ఈ నెల 20 వ తారీఖున గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ గ్రౌండ్స్ లో జారహాబోతున్నట్టు తెలుస్తుంది.