Home Entertainment లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి ఆర్ధిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్

లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి ఆర్ధిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్

2 second read
0
0
483

ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఎంత మంచి లాభాలు వచ్చాయో..వరుస డిజాస్టర్స్ తో కూడా అంతే నష్టాలు వచ్చాయి..ఒక దానిని మించి ఒకటి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయో..అలాగే ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా అలాగే వచ్చాయి..ఒక్క మాట లో చెప్పాలంటే టాలీవుడ్ కి ఇది కొంచెం తీపి కొంచెం చేదు సంవత్సరం అనే చెప్పాలి..అఖండ, పుష్ప, భీమ్లా నాయక్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు గలగల లాడించిన తర్వాత వెంటనే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచి దాదాపుగా 250 కోట్ల రూపాయిలు నష్టాలను వాటిల్లేలా చేసింది..ఆ తర్వాత వెంటనే #RRR , KGF చాప్టర్ 2 వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని దున్నేసిన సమయం లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దాదాపుగా 90 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది ఈ సినిమా.

ఈ సినిమా తర్వాత వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అంతంత మాత్రంగానే ఆట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చిన విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ F3 భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఇక ఆ తర్వాత వచ్చిన మేజర్ మరియు విక్రమ్ సినిమాలు ఎలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ రన్ ని కొనసాగిస్తున్న సమయంలోనే విడుదలైన న్యాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా వసూళ్లు పరంగా పర్వాలేదు అనే అనిపించింది..కానీ టాలీవుడ్ కి అసలు సిసలు దరిద్రం ఇక్కడి నుండే ప్రారంభం అయ్యింది..అంటే సుందరానికి సినిమా తర్వాత వచ్చిన పక్క కమర్షియల్, థాంక్యూ మరియు రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ క్లోసింగ్ కి కనీసం డబుల్ డిజిట్స్ ని కూడా రప్పించుకోలేకపోయ్యాయి..అలాంటి సమయం లో లేటెస్ట్ గా భింబిసారా , సీత రామం మరియు కార్తికేయ 2 వంటి చిత్రాలు ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అనేది తెలిసిందే.

అలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ కి విజయ్ దేవరకొండ ‘లైగర్’ రూపం లో మరో స్పీడ్ బ్రేకర్ పడింది..లైగర్ సినిమా బయ్యర్స్ కి ఇచ్చిన నష్టాలు మామూలువి కాదు..దాదాపుగా 73 కోట్ల రూపాయిలు నష్టాలను మిగిలించింది..వారం కూడా గడవక ముందే థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్న సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైగర్ సినిమా బయ్యర్స్ కి ఒక దేవుడిలా కనిపించాడు..ఆయన పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జల్సా మరియు తమ్ముడు సినిమాలు స్పెషల్ షోస్ వేసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ స్పెషల్ షోస్ కి అభిమానుల్లో మాములు క్రేజ్ లేదు..రిలీజ్ రోజు టికెట్స్ కోసం అభిమానులు ఎలా అయితే కొట్టుకుంటారో..జల్సా మరియు తమ్ముడు సినిమాల టికెర్స్ కోసం అభిమానులు అలాగే కొట్టుకుంటున్నారు..ఈ డిమాండ్ ని కాష్ చేసుకోవాలని ఆలోచించిన డిస్ట్రిబ్యూటర్స్ లైగర్ సినిమా షోస్ ని క్యాన్సిల్ చేసి ఆగష్టు 31 వ తేదీ నుండి సెప్టెంబర్ 2 వరుకు జల్సా సినిమా మరియు తమ్ముడు సినిమాలు వేసుకుంటున్నారు..ఈ సినిమాలకు వస్తున్నా హౌస్ ఫుల్స్ చాలా మంది స్టార్ హీరోలకు కూడా వచ్చి ఉండదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..రేపు ఈ షోస్ నుండే ఈ సినిమా 5 నుండి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..బాగా నష్టాల్లో కూరుకుపోయిన లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కాస్త అయినా లాభ పడ్డారు అని చెప్పొచ్చు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…