Home Entertainment లైగర్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

లైగర్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
193

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా..పూరి జగన్నాథ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో ఘనంగా విడుదల చేసారు..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే విడుదలకు ముందు నుండి హీరో మరియు డైరెక్టర్ డబ్బాలు కొట్టుకుంటూ వచ్చారు..కానీ వాళ్ళు ఇచ్చిన హైప్ కి ఈ సినిమా కనీసం కూడా మ్యాచ్ చెయ్యలేకపోయింది..మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ నీవు సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి రోజు పర్వాలేదు అని అనిపించినా రెండవ రోజు నుండి షేర్ కాదు కదా కనీసం గ్రాస్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది..హైదరాబాద్ లాంటి సిటీ లో సినిమాని వారం రోజులు కాకముందే ఎత్తేస్తున్నారు..ఇంతటి దారుణమైన పరాజయం ఈ ఏడాది ఏ సినిమాకి దక్కలేదు అని చెప్పొచ్చు.

విజయ్ దేవరకొండ పాపం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు..ఫైట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు..కానీ ఆ శ్రమ మొత్తం పూరి జగన్నాథ్ నిర్లక్ష్యం వాళ్ళ బూడిద లో పోసిన పన్నీరు లాగ మారింది..విజయ్ దేవరకొండ కి యూత్ లో ఉన్న క్రేజ్ వల్ల తెలుగు మరియు హిందీ లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి..ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ..క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రం అతి దారుణంగా వచ్చాయి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 90 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ క్లోసింగ్ కి తెలుగు వెర్షన్ కనీసం 15 కోట్ల రూపాయిల షేర్ కూడా వచ్చేలా లేదు..రెండవ రోజే ఈ సినిమాకి కోటి రూపాయిల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి..ఇప్పటి వరుకు ఈ సినిమా 13 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..నిన్న చాలా ప్రాంతాలలో జీరో షేర్ రావడం తో ఈ సినిమాని పీకేసే పరిస్థితి ఏర్పడింది.

సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉండడం తో..అభిమానులు జల్సా సినిమా స్పెషల్ షోస్ ప్లాన్ చేసారు..వీటికి ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడడం తో లైగర్ కి కేటాయించిన షోస్ అన్నిటిని జల్సా సినిమాకి కేటాయించేసారు..దీనితో లైగర్ పరిస్థితి క్లోసింగ్ కి పడిపోయినట్టు అయ్యింది..అయితే తెలుగు వెర్షన్ తో పోలిస్తే హిందీ వెర్షన్ కాస్త పర్వాలేదు అని చెప్పుకోవచ్చు..ఎందుకంటే అక్కడ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..మొదటి రోజే నాలుగు కోట్లు వచ్చేసాయి..రెండవ రోజు మూడవ రోజు కూడా పర్వాలేదు అనే అనిపించింది..ఇప్పటి వరుకు ఈ సినిమా అక్కడ ఆరు కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యొచ్చు..మొత్తం మీద ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి క్లోసింగ్ 24 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..అంటే బయ్యర్స్ కి దాదాపుగా 70 కోట్ల రూపాయిలు నష్టాల్ని మిగిలించింది అన్నమాట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…