
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి చిన్న చిన్న పాత్రల ద్వారానే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన నటులలో ఒకరు రాజశేఖర్..ఒక్కప్పుడు ఈయన పెద్ద మాస్ హీరో..ఈయనకి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజి కూడా ఉంది..అయితే ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి..క్యారక్టర్ ఆర్టిస్ట్స్ మరియు విలన్ రోల్స్ చెయ్యడానికి సిద్ధం గా ఉన్నానని పలు ఇంటర్వూస్ చెప్పినప్పటికీ ఆయన మనసుకు నచ్చే పాత్రని డైరెక్టర్స్ చెప్పడం లేదంటూ చెప్పుకొచ్చాడు..ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు కానీ, వాటిని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు..కానీ ఆయన కూతుర్లిద్దరూ కూడా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా అడుగుపెట్టి స్థిరపడిపోయారు..శివాని మరియు శివాత్మికలు హీరోయిన్స్ గా పలు సినిమాలలో నటించారు..శివాని తేజ సజ్జల హీరో గా తెరకెక్కిన అద్భుతం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది..లాక్ డౌన్ సమయం లో ఈ చిత్రం OTT లో విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ఆ చిత్రం లో ఆమె నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఆ తర్వాత తన తండ్రితో కలిసి ‘శేఖర్’ అనే చిత్రం లో నటించింది శివాని..ఇప్పుడు లేటెస్ట్ గా రాజ్ తరుణ్ హీరో గా నటించిన ‘అహనా పెళ్ళంటా’ అనే వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకి వచ్చింది..జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ కోసం శివాని పలు ఇంటర్వూస్ లో పాల్గొంది..ఈ ఇంటర్వూస్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆమె మాట్లాడుతూ ‘ఒకరోజు నేను హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్ళాను..నాతో పాటు నా స్నేహితుడు కూడా వచ్చారు..ఆ ట్రిప్ లో మా ఫ్యామిలీ కూడా ఉంది..ఒక రోజు నేను నా ఫ్రెండ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తే శివాని లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంది అంటూ రూమర్స్ వచ్చాయి’.
‘ఇది చూసి నేను షాక్ గురై చాలా బాధపడ్డాను..సోషల్ మీడియా లో వ్యూస్ కోసం , డబ్బుల కోసం ఏది పడితే అది రాసేస్తున్నారు..చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు బ్రతికి ఉండగానే చనిపోయినట్టు రాసారు..వాటితో పోలిస్తే నా మీద వచ్చిన రూమర్స్ చాలా చిన్నవిగా అనిపించాయి..పట్టించుకోవడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చింది శివాని..ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇక రాజా శేఖర్ రెండవ కూతురు శివాత్మిక కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ‘దొరసాని’ అనే చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది..ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి..కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా ఈమెకి హీరోయిన్ రోల్స్ బాగానే వస్తున్నాయి.