
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఏది చేసిన ఒక్క ప్రభంజనమే, ఆయన సినిమా వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పండగ వాతావరణమే కనిపిస్తుంది, ఇక పవర్ స్టార్ ఒక్కసారి మాస్ గెటప్ లో ఒక్క సినిమా తీస్తే ఆ సినిమా మానియా ని ఆపడం ఎవరి తరం కాదు, ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మానియా నే కనపడుతుంది, గబ్బర్ సింగ్ సినిమా తో ఆ మేనియా ఎలా ఉంటుందో మన అందరం చూసాము, ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు ఊర మాస్ క్యారక్టర్ తో భీమ్లా నాయక్ సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు మన పవర్ స్టార్, ఈ సినిమా పై ఆయన అభిమానుల్లోనే ప్రేక్షకుల్లో కూడా భగారి అంచనాలు ఉన్నాయి,మూడు నెలల క్రితం ఈ సినిమా నుండి విడుదల అయినా చిన్న గ్లిమ్స్ సోషల్ మీడియా ని ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక టైటిల్ సాంగ్ కి అయితే విడుదల అయినా అతి కొద్దీ రోజులకే 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇక గ్లిమ్స్ లో ఉన్న లా లా భీమ్లా అనే బిట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ బిట్ సోషల్ మీడియా లో మరియు ప్రైవేట్ ఫంక్షన్స్ లో ఒక్క రేంజ్ లో వినపడింది,దీనితో పూర్తి పాట ఎప్పుడెప్పుడూ విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో కాలం నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు, వారి ఎదురు చూపులకు తెర దించుతూ లా లా భీమ్లా పూర్తి పాట ని దీపావళి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నాము అని ఆ చిత్ర యూనిట్ ఒక్క ఊర మాస్ పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు, అంతే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రోజు ఎంత హడావుడి అయితే ఉంటుందో , ఆ స్థాయి హడావుడి ఈరోజు కనపడింది, ఇక సాంగ్ వచ్చిన తర్వాత కేవలం 24 గంటల్లోనే పది లక్షల లైక్స్ ని కొట్టడానికి అభిమానులు సమయత్నమవుతున్నారు, ఇదే కనుక జరిగితే ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు కొట్టినట్టే అని చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయినా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి కేవలం 24 గంటల్లో 8 లక్షల లైక్స్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తన్నారు అనేది.
ఇక భీమ్లా నాయక్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది, అదే సంక్రాంతి రేస్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవుతుంది, ఆర్ ఆర్ ఆర్ కి పోటీ రాలేక అప్పటికే సంక్రాంతికి వద్దాము అని అనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మరియు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలు వెనక్కి వెళ్లాయి , కానీ పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమా నిర్మాతలు మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తున్నారు, ఎవడొచ్చిన రాకపోయినా మేము మాత్రం సంక్రాంతికే వస్తాము అంటూ బలంగా నిర్ణయించుకున్నారు, ఇక అదే సంక్రాంతికి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా రాబోతుంది, ఇలా ఒక్క సంక్రాంతి పండగ సీజన్లో ఒక్కేసారి మూడు పెద్ద సినిమాలు రావడం ఇటీవల కాలం లో ఇదే తొలిసారి, మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.