
కరోనా కారణంగా కుదేలు అయిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఊపిరి పోసిన సినిమా ఏదైనా ఉండ అంటే అది బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, దాదాపుగా ఏడాది కాలం నుండి మాస్ కరువు లో ఉన్న తెలుగు సినిమా పేక్షకులకు ఈ సినిమా ఒక్క ఫీస్ట్ లాగ ఉండింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,కేవలం 40 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది, అంటే పెట్టిన డబ్బులకు దాదాపుగా రెండింతలు ఎక్కువ వసూలు చేసింది అన్నమాట, బయ్యర్లకు ఈ స్థాయిలో లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు ఇటీవల కాలం లో చాలా తక్కువ అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త,దీని తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు పుష్ప , భీమ్లా నాయక్ మరియు RRR సినిమాలు కూడా ఈ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టలేదు అని టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.
పూర్తి విశ్లేషణలోకి వెళ్తే పుష్ప మరియు భీమ్లా నాయక్ సినిమాలు వంద కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన సినిమాల క్లబ్ లోకి వెళ్లినప్పటికీ కూడా బయ్యర్లకు కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు తప్పలేదు, ఎందుకంటే స్టార్ హీరో సినిమాలు కావడం, దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరగడం, దానికి తగ్గట్టు గా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ మరియు పబ్లిక్ టాక్ రాకపోవడం, ఇవి అన్ని ఈ రెండు సినిమాలు భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టలేకపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు, ఇక RRR సినిమా బయ్యర్లకు ఇప్పటి వరుకు 133 కోట్ల రూపాయిల లాభాలు తెచ్చిపెట్టింది, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 420 కోట్ల రూపాయలకు జరగగా 18 రోజులకు గాను 560 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది,ఇప్పటికి విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు గా తెలుస్తుంది, ఇంతటి ప్రభంజనమ్ సృష్టించిన ఈ సినిమా కూడా లాభాల విషయం లో అఖండ కంటే వెనకపడింది అని ట్రేడ్ వ్ ఆర్గాల్లో వినిపిస్తున్న వార్త, అది ఎలాగో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే అఖండ సినిమా పెట్టిన డబ్బులకు రెండింతలు వసూలు చేసింది, కానీ RRR కి భారీ లాభాలు వచ్చినప్పటికీ కూడా అఖండ స్థాయిలో డబల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం లేదు అనేది ట్రేడ్ వర్గాల వాదన, ప్రాంతాల వారీగా కూడా RRR కి పెట్టిన డబ్బులతో వచ్చిన ప్రాఫిట్స్ స్వల్పం మాత్రమే, కానీ అఖండ కి మాత్రం పది రూపాయిలు పెడితే వంద రూపాయిల లాభాలు తెచ్చిపెట్టే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం, ఆ రకంగా చూసుకుంటే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నిట్లో పోలిస్తే అఖండ సినిమాకి వచ్చిన లాభాలే ఎక్కువ అని ట్రేడ్ వర్గాల సాగుతున్న చర్చ, మరి భవిష్యత్తులో అఖండ సినిమా స్థాయిలో లాభాలు తెచ్చి పెట్టె సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.