Home Entertainment లాభాల తోనే #RRR ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్ 2

లాభాల తోనే #RRR ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్ 2

7 second read
0
0
550

ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని KGF చాప్టర్ 2 సినిమా గత వారం రోజుల నుండి ఎలా శాసిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా ప్రతి భాషలో కూడా ఈ సినిమా అక్కడి స్టార్ హీరోల రికార్డ్స్ ని బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతుంది..#RRR తో మొదట్లయినా ఈ బాక్స్ ఆఫీస్ జాతర నేడుఇ KGF తో తో కొనసాగుతూ..కరోనా కారణంగా కుదేలు అయ్యిపోయిన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పూర్వ వైభవం ని తీసుకొచ్చారు మన సౌత్ ఇండియన్ దర్శకులు SS రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్..ముఖ్యంగా బాలీవుడ్ లో KGF సాధిస్తున్న రోజువారీ రికార్డులు చూస్తూ ఉంటె భవిష్యత్తు లో ఖాన్స్ కూడా ఈ వసూళ్లను అందుకోవడం కష్టంలా అనిపిస్తుంది..ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నుండే 500 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉంది అని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చెప్తున్నారు ట్రేడ్ పండితులు..ఇదే కనుక జరిగితే బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 మరియు దంగల్ రికార్డ్స్ బద్దలు అయ్యిపోయినట్టే అనుకోవచ్చు.

కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, లాభాల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక అసలు విషయానికి వస్తే KGF చాప్టర్ 2 ప్రీ రిలీజ్ మొత్తం కమిషన్ బేసిస్ మీదనే జరిగింది అట..అంటే వచ్చే గ్రాస్ లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్తే, మిగిలిన 50 శాతం నిర్మాతకి వెళ్తుంది..నిజంగా KGF నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా సాహసం అనే చెప్పాలి..ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో ఒక్కవేల సినిమా ఫ్లాప్ అయితే అటు నిర్మాతకి ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది..కానీ మేకర్స్ కి సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది..అందుకే విడుదలకు ముందు ఈ సినిమా కి ట్రేడ్ లో వేరే లెవెల్ క్రేజ్ ఉన్నా, బయ్యర్లు ఈ సినిమాని ఫాన్సీ రేట్ కి కొనడానికి ఎగబడిమరీ నిర్మాత వద్ద కి వచ్చిన..వాళ్ళు వాటి అన్నిటిని కాదు అని కమిషన్ బేసిస్ మీద మాత్రమే ఈ సినిమా ని విడుదల చేసారు..దాని ఫలితం ఈరోజు ఇండియన్ సినిమాలోనే ఏ ప్రొడ్యూసర్ కూడా కలలో కూడా ఊహించని లాభాలు.

KGF చాప్టర్ 2 సినిమా కేవలం 5 రోజుల్లోనే దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇందులో టాక్సలు మరియు థియేటర్స్ రెంట్స్ అన్ని పోగా దాదాపుగా 300 కోట్ల రూపాయిల లాభాలు కేవలం 5 రోజుల్లోనే వచ్చాయి..రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల రూపాయిల మార్కుని కూడా అతి తేలికగా అందుకోబోతుంది..అంటే నిర్మాతకి దాదాపుగా 500 కోట్ల రూపాయిలు లాభాలు రాబోతున్నాయి అన్నమాట..నార్త్ ఇండియా లో ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా వస్తున్నా వసూళ్లు చూస్తూ ఉంటె ఇది వెయ్యి కోట్ల రూపాయలతో ఆగే సినిమా లాగ కనిపించడం లేదు..ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తూ పోతే ఈ సినిమా ఫుల్ రన్ లో బాహుబలి 2 వసూళ్లను కూడా అధిగమిస్తుంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా..బాహుబలి 2 ఫుల్ రన్ లో దాదాపుగా 1800 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..KGF ఆ స్థాయి వసూలు రాబడితే నిర్మాతకి దాదాపుగా 900 కోట్ల రూపాయిల లాభాలు వస్తుంది..ఇది కాకుండా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి..అవి కలుపుకుంటే వచ్చే లాభాలు వెయ్యి కోట్ల రూపాయిల పై మాటే అని చెప్పొచ్చు..ఇదే కనుక జరిగితే #RRR కి ఫుల్ రన్ లో వచ్చిన గ్రాస్ ని కేవలం లాభాల తోనే అధిగమించనుంది KGF ..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాని కేవలం వంద కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు..100 కోట్ల రూపాయిల పెట్టుబడి తో వెయ్యి కోట్ల రూపాయిల లాభాలు..భవిష్యత్తులో ఇంతటి లాభాలు చూసే సినిమా రాదు అని అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…