Home Entertainment రేవంత్ కి అన్యాయం..బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ గా రోహిత్..వైరల్ అవుతున్న వీడియో

రేవంత్ కి అన్యాయం..బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ గా రోహిత్..వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
263

బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ముందే చెప్పాడు. దీంతో శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదుగురిలో బిగ్‌‌బాస్ విన్నర్ ఎవరో ఆదివారం తేలిపోతుంది. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ రోహిత్ అని ప్రచారం జరుగుతోంది. ఈలోపే గూగుల్ ముందే కూసింది. బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరు అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు చూపిస్తోంది. ఈ మేరకు రోహిత్ సాహ్ని పేరును చూపిస్తోంది. గతంలో కూడా గూగుల్ ఇలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ పేరును కూడా ముందే అభిజిత్ పేరు చూపించింది. మళ్లీ ఇప్పుడు సీజన్ 6లో అలానే చూపిస్తుండటంతో నెటిజన్‌లు రోహిత్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుత పరిస్థితి, ఓటింగ్ చూస్తుంటే రేవంత్‌కు అధికంగా ఓట్లు పడుతున్నాయి. ఇక తరువాతి స్థానంలో రోహిత్, శ్రీహాన్ పేర్లు ఉన్నాయి. ఒక్కోసారి శ్రీహాన్ పేరు కూడా రెండో స్థానానికి వస్తోంది. ఇక కీర్తి, ఆదిరెడ్డి మాత్రం చివరి 4, 5 స్థానాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం విన్నర్ అయ్యే అవకాశాలు రేవంత్, రోహిత్, శ్రీహాన్‌లలో ఎవరో ఒకరికి ఉంది. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన రోహిత్ హౌస్‌లో పెద్దగా ఇరగదీసింది ఏమీ లేదు. అయితే అతడు సీజన్ మొత్తం చాలా కూల్‌గా ఆడాడు. విన్నర్ మెటీరియల్ అంటే ఇలా ఉండాలి అనేలా రోహిత్ బిగ్ బాస్ జర్నీ సాగింది. చొక్కాలు చించుకుని ఆడితేనే విజేత కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చిన తట్టుకుని నిలబడాలి, సహనాన్ని కోల్పోకూడదు, మాటలు విసరకూడదు… ఇవన్నీ రోహిత్ లోనే పుష్కలంగా ఉన్న గుణాలు. రేవంత్ ఆట బాగా ఆడిన అతని ప్రవర్తన చాలా చికాకు కలిగించేలా ఉంటుంది. ప్రతి దానికి వాదన, విపరీతమైన కోపం చూడటానికి అంత ప్రశాంతంగా ఉండవు. రోహిత్ గతంలో పలు సీరియళ్లలో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో తన భార్య మెరీనాతో కలిసి హౌస్‌లోకి వెళ్లాడు.

భార్యతో కలిసి ఉన్నా రోహిత్ టాస్కులలో మాత్రం ఒక్కడిగానే ఆడేవాడు. అయితే బిగ్‌బాస్ సీజన్ మొత్తంలో చివరి వరకు ఉన్నవారిలో కెప్టెన్ కాని కంటెస్టెంట్ రోహిత్ ఒక్కడే. అయితే అతడి ఆట బాగానే ఉన్నా కొన్నిసార్లు శాక్రిఫైజ్ కారణంగా కెప్టెన్ కాలేకపోయాడు. బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌లో చివరి వీక్ నడుస్తోంది. దీంతో ఈ వీక్ అంతా కంటెస్టెంట్ల జర్నీలను బిగ్‌బాస్ చూపించాడు. తొలుత రేవంత్ జర్నీ, ఆ తర్వాత రోహిత్ జర్నీ చూపించారు. రెండో రోజు ఆదిరెడ్డి, శ్రీసత్య జర్నీలను చూపించారు. అనంతరం శ్రీహాన్, కీర్తి జర్నీలను ప్రసారం చేశారు. ఈ తంతు పూర్తయిన తర్వాత ప్రేక్షకులకు ఓటింగ్ అప్పీల్ చేసుకునే టాస్కును బిగ్‌బాస్ నిర్వహించాడు. ఈ టాస్కులో తొలుత రోహిత్ గెలిచాడు. ఆ తర్వాత శ్రీసత్య, శ్రీహాన్ ఓటింగ్ అప్పీల్ చేసుకున్నారు. అటు బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ ముందుగా 50 లక్షలు అని ఎప్పుడో ప్రకటించారు. కానీ కంటెస్టెంట్లకు రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో అమౌంట్ తగ్గించారు. మళ్లీ వాటికి రికవర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టాస్కులు పెట్టాడు. చివరకు మళ్లీ 50 లక్షలను చేశారు. విన్నర్‌కు ఈ అమౌంట్‌‌తో పాటు స్థలం, కారు కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు గతంలో నాగార్జున ప్రకటించాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…