Home Entertainment రెండవ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత

రెండవ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత

0 second read
0
0
60,760

ఇటీవల కాలం లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించిన అంశాలలో ఒక్కటి సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవహారం, మేడ్ ఫర్ ఈచ్ అథర్ లా అనిపించే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులనే కాదు, సగటు సినీ అభిమానిని ఎంతో బాధకి గురి చేసింది, విడాకులు తీసుకొని దాదాపుగా 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి వీళ్లిద్దరి గురించి రోజు ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది, ఇప్పుడు లేటెస్ట్ గా సమంత గురించి ప్రచారం అవుతున్న ఒక్క వార్త సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, అదేమిటి అంటే సమంత మళ్ళీ నాగ చైతన్య తో కలిసిపోబోతుంది అని, త్వరలోనే అక్కినేని మరియు సమంత అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుంది అని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో షికారు చేస్తూ ఉంది, ఇందులో ఎలాంటి నిజం లేదు కానీ, కేవలం పుకారు మాత్రమే అని సమంత సన్నిహిత వర్గాలు కొట్టి పారేశాయి, అయితే ఇటీవల సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అని మరో వార్త సోషల్ మీడియా లో ప్రచారం లోకి వచ్చింది.

ఇక అసలు విషయం లోకి వెళ్తే సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే,అయితే సమంత తల్లి తండ్రులు మాత్రం ఆమెకి రెండవ పెళ్లి చెయ్యాలి అని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు అట, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉంది అని , కెరీర్ లో ఫ్రీ స్పేస్ దొరికిన తర్వాత పెళ్లి సంగతి కచ్చితంగా ఆలోచిస్తాను అని తన తల్లి తండ్రులకు చెప్పింది అట, ఈ విషయాన్నీ స్వయంగా ఆమె స్నేహితురాలు ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలియచేసింది, అయితే ఈసారి పెళ్లి బాధ్యతలు మొత్తం తన తల్లి తండ్రుల ఇష్టం మేరకే చేసుకోబోతుంది అట సమంత, తన ప్రొఫెషనల్ లైఫ్ ని అర్థం చేసుకొని నడుచుకునే వ్యక్తి దొరికితే అతనితోనే ఆమె జీవిత ప్రయాణం చెయ్యడానికి సిద్ధం అవుతుంది అని తెలుస్తుంది, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, మరి సమంత రెండవ పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఇక సమంత కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం ఆమె చేతిలో శాకుంతలం మరియు యశోద అనే రెండు భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి, వీటితో పాటుగా ఆమె హాలీవుడ్ లో ఒక్క క్రేజీ ఆఫర్ ని కూడా కొట్టేసింది, ఈ సినిమా షూటింగ్ కూడా తర్వలోనే సెట్స్ పైకి వెళ్లనుంది, ఇక వీటితో పాటుగా తమిళ్ లో ఆమె విజయ సేతుపతి మరియు నయనతార తో కలిసి ఒక్క సినిమా చేసింది, ఈ సినిమా లో ఆమె విలన్ గా నటించింది,షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మన ముందుకి రాబోతుంది, సమంత ఇలా విలన్ గా నటించడం ఇది మూడవసారి, గతం లో ఆమె ఫామిలీ మ్యాన్ సీసన్ 2 విలన్ గా చేసి మంచి పేరు ని సంపాదించుకుంది, అంతకు ముందు విక్రమ్ తో కలిసి ఆమె చేసిన 10 ఎండ్రకుల్లా అనే సినిమాలో కూడా ఆమె విలన్ గా నటించింది, అందులోనూ మంచి మార్కులే కొట్టేసింది, ఇలా కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నెగటివ్ రొలెస్ చెయ్యడానికి కూడా సిద్దమే అంటూ సమంత డైరెక్టర్లకు ఓపెన్ గానే చెప్పేస్తుంది,ఒక్క పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క నెగటివ్ రోల్స్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…