
మహేష్ బాబు ఈరోజు మన ముందు సూపర్ స్టార్ గా ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు అంటే దానికి కారణం పోకిరి సినిమా..2006 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది..అక్షరాలా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటి మహేష్ బాబు ని సూపర్ స్టార్ ని చేసింది..ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు కమర్షియల్ సినిమా పోకిరి కి ముందు పోకిరి కి తర్వాత అని విభజించవచ్చు..ఆ స్థాయిలో ఈ సినిమా ఒక ట్రెండ్ ని సృష్టించింది..తొలుత పూరి జగన్నాథ్ ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత రవితేజ తో కూడా చేద్దాం అనుకున్నాడు..కానీ ఎందుకో వాళ్లిదరు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు..ఇక ఆ తర్వాత ఈ కథ మహేష్ బాబు వద్దకు వెళ్ళింది..పూరి జగన్నాథ్ పండుగాడు పాత్రని మలచిన తీరు ఆయనకీ ఎంతగానో నచ్చింది..కానీ కథలో కొన్ని కీలకమైన మార్పులు మహేష్ బాబు సూచించాడు అట..ముఖ్యం గా పోకిరి క్లైమాక్స్ ట్విస్ట్ ఆరోజుల్లో ఎంతలా పేలిందో మన అందరికి తెలిసిందే.
అభిమానులు మరియు ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసింది ఈ క్లైమాక్స్ ట్విస్ట్..టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన క్లైమాక్స్ అని చెప్పొచ్చు..ఈ సినిమా క్లైమాక్స్ ని చూసి చాలా సినిమాలు అదే తరహా క్లైమాక్స్ తో సినిమాలు తీసి సక్సెస్ సాధించారు..ఈ ఐడియా మహేష్ బాబుదే అట..ఆలా కథలో ఎన్నో కీలకమైన మార్పులు సూచించాడట మహేష్..అందుకే ఆ సినిమా ఔట్పుట్ అంత అద్భుతంగా వచ్చింది..ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాసింది..ప్రతి భాషలో రీమేక్ అయ్యి ప్రతి హీరో కి కెరీర్ టర్న్ అయ్యే రేంజ్ హిట్ గా నిలిచింది..అలాంటి సినిమా మళ్ళీ లోకి వస్తే ఎలా ఉంటుంది..బాక్స్ బద్దలు కదూ..ఇప్పుడు జరుగుతుంది కూడా అదే..మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు స్పెషల్ షోస్ పడనున్నాయి..ఇప్పటికే అన్నీ ప్రాంతాలలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి..ప్రధాన నగరాల్లో ఈ సినిమా టికెట్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..ఎగబడి మరి కొంటున్నారు..అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినా నిమిషాల్లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరం లో అయితే ఈ సినిమా కి 35 షోస్ కేటాయించారు..ఈ 35 షోస్ కి ఒక్క టికెట్ ముక్క కూడా దొరకలేదు అంటే ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఈ రికార్డు మాములు రికార్డు కాదు..ఇప్పట్లో ఎవ్వరు కూడా టచ్ చెయ్యలేని రికార్డు..కానీ ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కానీ బ్రేక్ చేసే అవకాశం ఉంది..కానీ పోకిరి సినిమాకి నేరుగా మహేష్ బాబు కి సంబంధించిన PR టీం షోస్ ని కండక్ట్ చేస్తుంది..పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కానీ , ఎన్టీఆర్ ఫాన్స్ కి కానీ అలాంటి PR టీం లేదు..అందుకే వాళ్లకు ఈ రేంజ్ లో షోస్ పడకపోవచ్చు కానీ కచ్చితంగా ఈ రికార్డు ని బ్రేక్ చెయ్యడానికే చూస్తారు..మరి చూడాలి పోకిరి సాధించిన ఈ అనితర సాధ్యమైన రికార్డు ని ఎవరు బ్రేక్ చేస్తారు అనేది.