Home Entertainment రిస్క్ చేసిన కళ్యాణ్ రామ్ కి లాభాలే లాభాలు..భింబిసారా కి వచ్చిన లాభాలు ఎంతో తెలుసా?

రిస్క్ చేసిన కళ్యాణ్ రామ్ కి లాభాలే లాభాలు..భింబిసారా కి వచ్చిన లాభాలు ఎంతో తెలుసా?

0 second read
0
0
1,081

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన సినిమా భింబిసారా..గడిచిన దశాబ్ద కాలం లో కళ్యాణ్ రామ్ సినిమా కోసం కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎదురు చూసింది ఈ సినిమాకే..టీజర్ మరియు ట్రైలర్ అలాంటివి మరి..విడుదల దగ్గర పడుతుండే లోపు ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూపోయాయి..అలా విడుదల తేదీ రానే వచ్చింది..అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు ఓవర్సీస్ లో కూడా అదిరిపోయాయి..ఇక టాక్ రావడమే తరువాయి కాసుల కనకవర్షం కురుస్తుంది అని అందరూ అనుకున్నారు..చివరికి అనుకున్నట్టే అయ్యింది..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో తీవ్రమైన గడ్డుకాలంని ఎదురుకుంటున్న తెలుగు సినిమా పరిశ్రమ కి ఆయువు పోసింది ఈ చిత్రం..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ కళకళలాడిపొయ్యేలా చేసింది..అయితే ఈ సినిమా తెరకెక్కేముందు కళ్యాణ్ రామ్ కి ఉన్న కమిట్మెంట్..స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం చూస్తే శబాష్ అనకుండా ఉండలేము.

కళ్యాణ్ రామ్ ని కలిసే ముందే ఆ చిత్ర దర్శకుడు వసిష్ఠ ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ని కలవడానికి ప్రయత్నాలు చేసాడు..కానీ కనీసం అతనికి అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు పాపం..అలాంటి సమయం లో కళ్యాణ్ రామ్ వసిష్ఠ కి తనని కలవడానికి అవకాశం ఇచ్చాడు..స్టోరీ మొత్తం విన్నాడు..ఆయనకీ ఎంతో అద్భుతంగా నచ్చింది..కానీ కళ్యాణ్ రామ్ రేంజ్ మార్కెట్ కి ఈ సినిమా బడ్జెట్ సరిపోదు..దాదాపుగా 45 కోట్ల రూపాయిలు బడ్జెట్ ఖర్చు అవుతుంది..అంత బడ్జెట్ పెట్టె నిర్మాత ఎవరు దొరకరు..అప్పుడు కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ ని నమ్మి..తనకి అంత మార్కెట్ లేదు అని తెలిసి కూడా ఈ సినిమా ని తన సొంత బ్యానర్ లో నిర్మించడానికి ముందుకి వచ్చాడు..మొత్తానికి అద్భుతమైన ఔట్పుట్ తో 45 కోట్ల రూపాయిల బడ్జెట్ తోనే 200 కోట్ల రూపాయిల క్వాలిటీ రప్పించుకున్నాడు..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కమిషన్ బేసిస్ మీద 15 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..అంటే పెట్టిన బడ్జెట్ కంటే చాలా తక్కువ రేట్స్ కి అమ్ముడుపోయింది..అయినా కానీ కళ్యాణ్ రామ్ లో ఏ మాత్రం ధైర్యం సన్నగిల్లలేదు.

ఇక విడుదల రోజు రానే వచ్చేసింది..మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది..ఓపెనింగ్స్ అదిరిపోయాయి..15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి కేవలం మొదటి రోజే 7 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఈ సినిమా కేవలం మొదటి రోజే 50 శాతం కి పైగా రికవరీ చేసింది..ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి..అలా ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం మూడు రోజుల్లోపే వసూలు చేసే దిశగా ముందుకు పోతుంది సినిమా..ఇక ఈ సినిమా కథని బలంగా నమ్మి 45 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిన కళ్యాణ్ రామ్ కి కేవలం మొదటి వారం లోనే తాను పెట్టిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..అలా కళ్యాణ్ రామ్ ఎంతో డేర్ తీసుకొని చేసిన ఈ చిత్రం స్లంప్ లో ఉన్న టాలీవుడ్ ని ఒక్కసారిగా పైకి లేపింది..అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డిని , పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి ని పరిచయం చేసినట్టుగా భింబిసారా సినిమా తో వసిష్ఠ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని పరిచయం చేసాడు..భవిష్యత్తులో ఇతను చాలా టాప్ రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

హాలీవుడ్ మూవీ అవతార్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. …