Home Entertainment రికార్డు స్థాయి షోస్ తో విడుదల అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ జల్సా మూవీ..పోకిరి రికార్డు బద్దలు కానుందా?

రికార్డు స్థాయి షోస్ తో విడుదల అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ జల్సా మూవీ..పోకిరి రికార్డు బద్దలు కానుందా?

1 second read
0
0
250

రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు పోకిరి సినిమా యుఫొరియా తో ఊగిపోతోంది..అదేంటి 15 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాకి ఇప్పుడు హుంగామ చేస్తున్నాం అనుకునేరు..అక్కడికే వస్తున్నాం..సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో పోకిరి సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నారు..వీటి టికెట్స్ మాములు క్రేజ్ లేదనే చెప్పాలి..ఎన్ని షోస్ వేసినా నిమిషాల్లోనే టికెట్స్ అన్నీ బుక్ అయిపోతున్నాయి..2006 వ సంవత్సరం లో సోషల్ మీడియా ఉంది ఉంటె పోకిరి సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఎలా ఉండేవో ఇప్పుడు అదే తరహా వాతావరణం కనిపిస్తుంది..ఇటీవల కాలం లో విడుదలైన మహేష్ బాబు కొత్త సినిమాల టికెట్స్ కి కూడా ఈ స్థాయి క్రేజ్ లేదు..కానీ పోకిరి సినిమా టికెట్స్ అంటే హాట్ కేక్స్ లాగ మారిపోయాయి..దానికి కారణం ఇప్పుడు వచ్చిన మహేష్ బాబు అభిమానులు చాలా మంది లక్షల సంఖ్యలో చిన్నప్పుడు పోకిరి సినిమాని థియేటర్స్ లో చూడడం మిస్ అయ్యి ఉంటారు..అందుకే ఈ సినిమా టికెట్స్ కి ఇంత డిమాండ్ ఉన్నది.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా జల్సా సినిమాని స్పెషల్ షోస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ప్లాన్ చేస్తున్నారు..ఈ సినిమా నెగటివ్ ప్రింట్ ప్రసాద్ లాబ్స్ లో అందుబాటులో ఉన్నింది..దీనిని బయటకి తీసి 4K ప్రింట్ గా మార్చే ప్రక్రియ శెరవేగంగా సాగుతుంది..అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు..పోకిరి సినిమాతో పోలిస్తే కంటెంట్ పరంగా జల్సా సినిమా చాలా తక్కువ..కేవలం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు అద్భుతమైన పాటల వల్ల ఈ సినిమా అప్పట్లో అంత పెద్ద హిట్ అయ్యింది..అప్పట్లో ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 హిట్ గా నిలిచింది..ఇప్పుడు రీ రిలీజ్ కి కూడా కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్లే ఈ సినిమాకి టికెట్స్ తెగేది అనడం లో ఎలాంటి సందేహం లేదు..అభిమానులందరూ ఎప్పుడెప్పుడు 4k ప్రింట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే పోకిరి సినిమాని మహేష్ బాబు పర్సనల్ టీం అన్నీ ప్రాంతాలలో ప్రత్యేకమైన డిస్ట్రిబ్యూటర్స్ ని పెట్టి విడుదల చేయించింది..కానీ జల్సా సినిమాకి అలాంటి ప్రత్యేకమైన టీంలు ఏమి లేవు..కేవలం అభిమానులు థియేటర్స్ బుక్ చేసుకొని షోస్ వేసుకోవాల్సిందే..కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సంగతి తెలిసిందే కదా..వీళ్ళ మాస్ కి థియేటర్స్ తట్టుకోలేవు..కేవలం వకీల్ సాబ్ ట్రైలర్ ని థియేటర్స్ లో విడుదల చేస్తేనే కనివిని ఎరుగని ఫుల్స్ మరియు సంబరాలతో హోరెత్తించారు..ఇక పాత సినిమా రీ రిలీజ్ అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ మొదటి రోజు సినిమాకి ఎలాంటి హంగామా అయితే ఉంటుందో అలాంటి హంగామా నే జల్సా సినిమా రీ రిలీజ్ కి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..రేపు విడుదల అవ్వబోతున్న పోకిరి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ లో 30 లక్షల రూపాయిల గ్రస్స్ ని వసూలు చేసింది..జల్సా సినిమా ఈ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…