Home Entertainment రామ్ ‘ది వారియర్’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

రామ్ ‘ది వారియర్’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
1
215

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ది వారియర్ మూవీ తొలివారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఫైనల్‌గా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో రామ్ తన కెరీర్‌లో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి సినిమాల తర్వాత రామ్ నటించిన ఈ మూవీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తమిళ ప్రసిద్ధ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని తెరకెక్కించడంతో పాన్ ఇండియా సినిమాగా మేకర్స్ ప్రచారం చేశారు. దీంతో బయ్యర్లు కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. అయితే బయ్యర్లను ఈ మూవీ నిండా ముంచింది. ఈ సినిమాతో బయ్యర్లు కోలుకునే అవకాశం లేదని తొలివారంతోనే తేలిపోయింది. ఓవరాల్‌గా ది వారియర్ సినిమా బయ్యర్లకు అటు ఇటుగా 50శాతం నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.45 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలివారం ఈ మూవీ రూ.19 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.26 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 34 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. వారం రోజుల వసూళ్లలో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 17 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం మరో రూ.17 కోట్లు రావాలి. ఈ వారం నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదలైంది. దీంతో వారియర్ సినిమా ప్రయాణం దాదాపు ముగిసినట్లుగానే భావించాలి. నైజాంలో రూ.5.44 కోట్లు, సీడెడ్‌లో రూ.2.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.27 కోట్లు, తూ.గో.లో రూ.1.26 కోట్లు, ప.గో.లో రూ.1.12 కోట్లు, గుంటూరులో రూ.1.87 కోట్లు, కృష్ణాలో రూ.90 లక్షలు, నెల్లూరులో రూ.61 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా మల్లీప్లెక్స్‌లలో రూ. 295, మాములు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రేట్లతో విడుదల చేశారు.

అటు ఓవర్సీస్‌లో కూడా ది వారియర్ సినిమాకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇటీవల ఓవర్సీస్‌లో తెలుగు సినిమా వసూళ్లు సంతృప్తికరంగానే ఉంటున్నాయి. అయితే రామ్ సినిమా మాత్రం తొలి వారం అమెరికాలో కోటి రూపాయల మార్క్ కూడా అందుకోలేకపోయింది. కేవలం 62 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాతో తెలుగులో మరో హిట్ తన ఖాతాలో వేసుకుందామని, అంతేకాకుండా కోలీవుడ్‌లో జెండా పాతేద్దామని అనుకున్న రామ్ ఆశలు గల్లంతయ్యాయి. రామ్‌కు మాస్ ఫాలోయింగ్ ఉండటంతో తొలిరోజు డీసెంట్ వసూళ్లు వచ్చినా మొత్తానికి డిజాస్టర్‌గా ది వారియర్ మిగిలిపోయింది. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఓపెనింగ్స్‌తోనే ఈ చిత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా పరాజయానికి రామ్ పోతినేని ఓవర్ కాన్ఫిడెన్స్ కారణమని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి నటించగా.. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు అభిమానులకు కొంచెం ఊరట కలిగించాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…