Home Entertainment రామ్ ‘ది వారియర్’ మూవీ కి వచ్చిన లాభాలు చూస్తే మెంటలెక్కిపోతారు

రామ్ ‘ది వారియర్’ మూవీ కి వచ్చిన లాభాలు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
2,876

ఎనెర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ప్రస్తుతం కుర్ర హీరోలలో వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు..ఆయన నటించిన ఇస్మార్ట్ శంకర్ మరియు రెడ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి..ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా అయితే రామ్ మార్కెట్ ని ఒక రేంజ్ లో పెంచేసింది..దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి రామ్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది..ఈ సినిమా తర్వాత విడుదలైన రెడ్ సినిమాకి టాక్ గొప్పగా లేకపోయినా కూడా రామ్ క్రేజ్ వల్ల హిట్ గా నిలిచింది..అలా వరుస విజయాలతో మంచివో ఊపు మీదున్న రామ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగు సామి తో కలిసి ‘ది వారియర్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటించగా, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది..బ్లాక్ బస్టర్ సాంగ్స్ మరియు అదిరిపొయ్యే ట్రైలర్ కట్ తో విడుదలకి ముందే భారీ హైప్ ని సృష్టించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదలైంది.

అయితే భారీ అంచనాలు ఏర్పడడం వల్లో ఏమో తెలీదు కానీ ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమాని కొన్ని బయ్యర్స్ కి టెన్షన్ పట్టుకుంది..ఎందుకంటే ఈ సినిమాని భారీ ఫాన్సీ రేట్స్ తో ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ లో కొన్నారు..ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 45 కోట్ల రూపాయలకు జరిగింది..ఇది టయర్ 2 హీరోలలో ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు..కానీ మొదటి రోజు వసూళ్లు ఆ రేంజ్ కి తగట్టు లేవు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మొదటి రోజు 7 నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది..కానీ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వసూలు కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే ఉండబోతుంది అట..ఇది డీసెంట్ వసూళ్లే అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కు కి ఈ ట్రెండ్ సరిపోదు అనే చెప్పాలి..రెండవ రోజు నుండి కచ్చితంగా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే ఛాన్స్ ఉంది..కానీ టాక్ అందుకు అనుకూలంగా లేదు.

అయితే హీరో రామ్ సినిమాలు మాస్ సెంటర్స్ లో అద్భుతంగా ఆడుతాయి..టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతాయి..మరో రెండు వారాలు ఏ సినిమా లేకపోవడం తో ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ మార్కు ని అందుకొని హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమా , ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయి ఓపెనింగ్ రాలేదు అనే చెప్పాలి..అక్కడ ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు..ఇకపోతే రామ్ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి..త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది..ఈ సినిమా తర్వాత రామ్ హరీష్ శంకర్ దర్శకత్వం లో నటిస్తాడు..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులకు పిచేక్కించబోతున్నాడు హీరో రామ్.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…