
ఉపాసన కొణిదెల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు..?, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా..రామ్ చరణ్ భార్య గా..మెగాస్టార్ చిరంజీవి కోడలిగా పరిచయం అక్కర్లేని పేరు ఉపాసన..ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్ళాడి నేటికీ సరిగ్గా పదేళ్లు పూర్తి అయ్యింది..ప్రస్తుతం ఈ జంట తమ 10 వ పెళ్లి రోజు ని ఫారిన్ లో సరదాగా గడుపుతున్నారు..ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రామ్ చరణ్..షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చి తన సతీమణి ఉపాసన తో వెడ్డింగ్ డే ని ఎంజాయ్ చెయ్యడం కోసం ఫారిన్ వెళ్లారు..ఫారిన్ లో వీళ్ళు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో క్రింద ఉన్న ఫోటోని చూస్తే అర్థం అయ్యిపోతుంది..ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ తో వైవాహిక జీవితం గురించి ఉపాసన కొణిదెల కొద్దీ రోజుల క్రితం చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఉపాసన మాట్లాడుతూ ‘నేను ఈరోజు నా జీవితంలో ఇంత దృడంగా నిలబడడానికి కారణం నా తల్లి తండ్రులు..చిన్నప్పటి నుండి వాళ్ళే నా లోకం లాగా ఉండేది..మిగిలిన కుటుంబాలలో లాగ కాకుండా మా ఇంట్లో నాకు ఎంతో ఫ్రీడమ్ ని ఇచ్చేవారు..వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను ఏనాడు కూడా తప్పుగా ఉపయోగించుకోలేదు..నిజాయితీగా సేవ భావం తో ఎలా పెరగాలి అనేది నా తండ్రి నాకు చిన్నతనం నుండే బాగా నేర్పించాడు..అది ఈరోజు నాకు మాత్రమే ఉపయోగపడకుండా ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగ పడుతుంది..అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి ఎవ చెయ్యగలుగుతున్నాను..ప్రతి ఆడపిల్ల జీవితం లో పెళ్లి ఒక్క కీలకమైన మలుపు..నా జీవితం లో కూడా అది ఎంతో ప్రత్యేకం..ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం..కానీ ఒక్కసారిగా చిన్నప్పటి నుండి మనం పెరిగిన వాతావరణం మారిపొయ్యేలోపు సర్దుకొని పోవడం చాలా కష్టం అయ్యింది..రామ్ చరణ్ తో పెళ్లి అయిన కొత్తల్లో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉండేవి..కానీ ఒకరినొక్కరు అర్థం చేసుకొని సర్దుకుంటూ పొయ్యేవాళ్ళం..అలా మాకు తెలియకుండానే మా వైవాహిక జీవితం పదవ సంవత్సరం లోకి అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది’అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.
ఇక రామ్ చరణ్ #RRR మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాతో ఆయన నేషనల్ లెవెల్ లో కాదు ఇంటర్నేషనల్ లెవల్ లో క్రేజ్ ని సంపాదించాడు..OTT లో #RRR విడుదల అయిన తర్వాత ఎక్కడ చూసిన రామ్ చరణ్ గురించే చర్చ..ముఖ్యంగా పశ్చిమ దేశాలలో రామ్ చరణ్ క్రేజ్ ఒక్క రేంజ్ లో పెరిగిపోయింది అనే చెప్పాలి..అంతటి విజయం సాధించిన సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన శంకర్ గారి దర్శకత్వం లో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..దిల్ రాజు ఈ సినిమాని తన 50 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తుండగా..కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ జెర్సీ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్నూరి తో ఒక్క సినిమా..అలాగే విక్రమ్, మాస్టర్ మరియు ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా చేయనున్నాడు..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మళ్ళీ డైరెక్టర్ సుకుమార్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇలా వరుస గా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానులని అలరించబోతున్నాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.