Home Movie News రామ్ చరణ్ తో గొడవ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన

రామ్ చరణ్ తో గొడవ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన

0 second read
0
0
2,089

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అన్యోయంగా ఉండే దంపతుల జాబితా తీసుకొస్తే వారిలో రామ్ చరణ్ మరియు ఉపాసన జంట ప్రధాన వరుసలో ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు, 2012 జూన్ 14 వ తారీఖున పెళ్లి చేసుకున్న ఈ జంట ఒక్కరి కోసం ఒక్కరు ఎంత ప్రేమగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఒక్కప్పుడు ఎంతో ఆవేశం మరియు దూకుడు గా ఉండే రామ్ చరణ్, పెళ్లి తర్వాత ఎంత కూల్ అయ్యిపోయాడో మన అందరం చూస్తూనే ఉన్నాము, నాలో ఇంత మార్పు రావడానికి కారణం ఉపాసన నా జీవితం లోకి రావడమే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి జీవిత భాగస్వామి దక్కదు, నా కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నా వెంట ఉంటూ ఎంతో ధైర్యం చెప్పేది ఆమె, నేను ఈరోజు ప్రతి విషయం లో ఇంత పాజిటివ్ గా ఉంటూ ఉన్నాను అంటే ఆమె కారణం అంటూ రామ్ చరణ్ ఎన్నో సందర్భాలలో ఉపాసన గురించి చెప్తూ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ఒక్క ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది,ఈ ఇంటర్వ్యూ లో ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి , అవి ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఆమె మాట్లాడుతూ ‘మేము ఇద్దరం ఎప్పుడు గొడవ పదము అని అందరూ అనుకుంటూ ఉంటారు, ఆలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే, మేమిద్దరం ఎన్నో సార్లు గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో సార్లు వితండవాదనలు చేసుకున్నాము కూడా, కానీ మొగుడి పెళ్ళాం మధ్య గొడవలు ఉండడం వల్లే బంధం బలపడుతుంది, మేమిద్దరం ఎప్పుడు గొడవ పడినా వెంటనే పక్క రోజు ఇద్దరం మాట్లాడుకొని మా సమస్య ని పరిష్కరించుకుంటాము, అలా మా 8 ఏళ్ళ దాంపత్య జీవితం లో ఎన్నో సార్లు జరిగాయి, అవి అన్ని ఒక్క ఖరీదైన మధుర జ్ఞాపకాలుగా నా మనసులో దాచుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన,కానీ అభిమానులకు వీళ్లిద్దరు గొడవ కూడా పెడుతారా అని ఆశ్చర్యపోతున్నారు,ఎందుకంటే అంతలా వాళ్ళిద్దరిని అభిమానులు అభిమానిస్తారు కాబట్టి, ఉపాసన రాంచరణ్ విషయం లో ఎంత కేరింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆమె రామ్ చరణ్ ని ఎప్పుడు కూడా భర్త కంటే ఒక్క కొడుకుల చూసుకునేది, ముఖ్యంగా ఫిట్ నెస్ విషయం లో రామ్ చరణ్ ఇప్పుడు ఇంత బాగా ఉన్నాడు అంటే దానికి కారణం ఉపాసననే, ఇక ఉపాసన తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో టిప్స్ అందిస్తూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా కోసం ఆయన దాదాపుగా రెండేళ్ల సమయాన్ని వెచ్చించాడు, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన అన్ని భాషలో విడుదల కానుంది, ఈ సినిమా తో పాటు ఆయన మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టిన ఆయన ఇటీవలే రాజమండ్రి లో జరగబొయ్యే ఒక్క షెడ్యూల్ లో పాల్గొనేందుకు రాజముండ్రి కి చేరుకున్నారు, ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తారు, ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ఈ రెండు సినిమాల తర్వాత ఇండియా గర్వపడే దర్శకులలో ఒక్కరు అయినా శంకర్ తో ఒక్క సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, శంకర్ తోలి సారిగా తెలుగు లో నేరిగా ఒక్క సినిమా చెయ్యబోతున్నారు, ఇలా ఒక్కేసారి రాజమౌళి మరియు శంకర్ వంటి దర్శకులతో పని చేస్తున్న ఏకైక హీరో గా రామ్ చరణ్ చరిత్రకి ఎక్కాడు, ఈ సినిమాని ఎప్పుడైతే ప్రకటంచారో అప్పటి నుండే అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి, రామ్ చరణ్ తానూ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మరియు ఆచార్య సినిమాల షూటింగులు పూర్తి అయినా వెంటనే శంకర్ సినిమా లో నటించబోతున్నట్టు సమాచారం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…