Home Entertainment రామ్ చరణ్ క్రేజ్ తో దద్దరిల్లిపోయింది ఢిల్లీ పార్లమెంట్

రామ్ చరణ్ క్రేజ్ తో దద్దరిల్లిపోయింది ఢిల్లీ పార్లమెంట్

0 second read
0
0
2,681

భారత దేశం మొత్తం ఇప్పుడు గట్టిగ వినిపిస్తున్న ఒక్కేఒక్క పేరు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం, దాదాపుగా నాలుగేళ్ల నుండి ఇండియన్ సినీ అభిమానులను ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై షూటింగ్ దశ నుండే అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి , ఇక విడుదల దగ్గర పడే సమయానికి ఆ అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్లిపోయాయి, సాధారణంగా ఈ స్థాయిలో అంచనాలు ఏర్పర్చుకున్న ఒక్క చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అభిమానులను మెప్పించడం అంత తేలికైన పని కాదు, కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డుల వర్షం కురిపిస్తూ ముందుకి దూసుకుపోతుంది,బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో, హీరోలిద్దరి నటనకి కూడా అదే స్థాయిలో ప్రశంసల జల్లు కురుస్తుంది.

ముఖ్యంగా హిందీ లో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు పాత్ర కి ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు అనే చెప్పాలి , క్లైమాక్స్ లో అల్లూరి సీత రామ రాజు గెటప్ లో కనిపించిన రామ్ చరణ్ ని చూసి ప్రతి ఒక్కరూ జై శ్రీ రామ్ అంటూ థియేటర్స్ లో నినాదాలు చేసిన వీడియోలు ఇది వరుకు మనం సోషల్ మీడియా లో ఎన్నో చూసాము , ఇప్పుడు పార్లిమెంట్ లో కూడా నిన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన ప్రస్తావన ఒక్క బీజేపీ ఎంపీ తీసుకొచ్చాడు, భారతదేశం లో హిందూ దేవాలయాలు ఎంతో పవిత్రమైనవి, వాటి పవిత్రతని కోట్లాది మంది ప్రేక్షకులకు తెలిపే మాధ్యమాలు ఎక్కువగా రావాలి, ఇటీవల టాలీవుడ్ లో వస్తున్నా ప్రతి ఒక్క సినిమాలో కూడా హిందూ దేవుళ్ళ గురించి గొప్పగా తెలుపుతూ సినిమాలు వస్తున్నాయి, అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించాయి, ఇటీవల విడుదల సంచలన విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో కూడా ఇలాంటి సన్నివేశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు బీజేపీ నేతలు.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది, ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది, అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…