
టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీ కపుల్స్లో రామ్చరణ్-ఉపాసన జంట అందరినీ ఆకర్షిస్తోంది. మెగాస్టార్ కుమారుడిగా రామ్చరణ్కు ఎంత క్రేజ్ ఉందో.. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా ఉపాసనకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఉపాసన ఎప్పుడు చూసినా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా కనిపిస్తుంది. రామ్చరణ్, ఉపాసన ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారు. కాలేజీలో కలిసి చదువుకున్న వీళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్న సెలబ్రిటీలు ఈ జంటను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
రామ్చరణ్-ఉపాసన జంటకు 2012లోనే వివాహం జరిగినా ఇప్పటివరకు పిల్లలు లేకపోవడం లోటుగానే కనిపిస్తుంది. వీళ్ళకు ఇంకా పిల్లలు లేరని ఒక్క మాట తప్పిస్తే ఈ జంట ది బెస్ట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడికి వెళ్లినా ఈ మధ్య ఉపాసనను తరచూ వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే.. మీరు పిల్లలు ఎప్పుడు కంటారు అనే విషయంపైనే. మరోవైపు మెగా అభిమానులు మాత్రం ఈ జంట దగ్గర నుంచి వచ్చే గుడ్ న్యూస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసనో ఎవరో ఒకరు ఎప్పుడు వస్తారని అందరూ ఆత్రుత పడుతున్నారు. అయితే ఎప్పుడూ కూడా ఈ విషయంపై రామ్ చరణ్ నోరు విప్పలేదు. ఇక ఉపాసన అయితే అది తమ పర్సనల్ విషయం అంటూ కాస్త సీరియస్ అవుతూ ఉంటుంది. ఇది తన వ్యక్తిగత అంశం అని.. ఈ విషయంలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకున్నానని చెప్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తుంటారని… అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని ఉపాసన చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెన్సీ మీద మోజు పడుతోందని.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా అందిస్తుందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత చెర్రీకి కాస్త సమయం దొరకడంతో కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. చెర్రీకి వీలు చిక్కినప్పుడల్లా.. తన సతీమణి ఉపాసనతో కలిసి వెకెషన్స్ వెళ్తుంటాడు. ప్రస్తుతం ఉపాసనకు ఆ వెకేషన్స్ రోజులు గుర్తుకు రావడంతో చెర్రీతో కలిసి గతంలో వెకేషన్కు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు చరణ్ పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన.. నా మైండ్లో కూడా వెకేషన్కు వెళ్లాలని ఉంది. కానీ ఆర్సీ 15 సినిమా వైజాగ్ షెడ్యుల్ పూర్తి కావాలి. కాబట్టి మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.