
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందే ఆసక్తికరమైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత మాత్రం అభిమానుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది..ఈ చిత్రం ద్వారా శరత్ మండవ ఇండస్ట్రీ కి నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు..అతని ఇంటర్వూస్ నెటిజెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది..సినిమా మీద పూర్తి స్థాయి నమ్మకం ఉన్నవాడిలా కనిపించాడు..కానీ సినిమా విడుదల తర్వాత అతను చేసింది మొత్తం అతి అని రవితేజ అభిమానులకు అర్థం అయ్యింది..కొత్త వాళ్ళను ప్రోత్సహించడం లో తప్పు లేదు..కానీ ఇలాంటి వారిని ప్రోత్సహించి నీ మార్కెట్ కి బొక్క పెట్టుకోకు అన్నా..నీ టాలెంట్ కి నువ్వు ఎక్కడో ఉండాలి అంటూ రవితేజ అభిమానులు ఆయనని సోషల్ మీడియా లో టాగ్ చేసి వేడుకుంటున్నారు..అయితే ఈ సినిమాకి మొదటి రోజు నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా రవితేజ బ్రాండ్ ఇమేజి ఓపెనింగ్స్ తీసుకొని రావడం లో సక్సెస్ అయ్యింది.
ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 17 కోట్ల రాయిపాయిలకు జరిగింది..మాములుగా రవితేజ మార్కెట్ పాతిక కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది..కానీ టాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదురుకుంటున్న నేపథ్యం లో ఈ సినిమా ని కేవలం 17 కోట్ల రూపాయలకే అమ్మారు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట బెన్ఫిట్ షోస్ మరియు మార్నింగ్ షోస్ అదిరిపోయాయి..ఓవర్సీస్ నుండి మంచి టాక్ రాకపోయినా కూడా రవితేజ ఓపెనింగ్స్ అదరగొట్టాడు అని డిస్ట్రిబ్యూటర్స్ ఆనందపడ్డారు..కానీ మాట్నీస్ నుండి నూన్ షోస్ కి వచ్చినంత ఆక్యుపెన్సీ రాలేదు..కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమాకి అన్ని చోట్ల డీసెంట్ ఓపెనింగ్ వచ్చింది అనే చెప్పాలి..డైరెక్టర్ కాస్త టేకింగ్ మీద శ్రద్ద పెట్టి ఉంటె ఈ సినిమా ఓపెనింగ్స్ మరో లెవెల్ లో ఉండేవి అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 4 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది అని తెలుస్తుంది.
ఇదే ట్రెండ్ ని ఒక మూడు రోజులు కానీ ఈ సినిమా కొనసాగిస్తే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కు అందుకొని లాభాల బాట పట్టి సూపర్ హిట్ గా నిలుస్తుంది అని అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు గట్టిగ నమ్ముతున్నారు..రవితేజ గత చిత్రం ఖిలాడీ డిజాస్టర్ ఫ్లాప్ టాక్ మీద కూడా మొదటి వారం మంచి వసూళ్లనే రాబట్టింది..ఫుల్ రన్ కూడా దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి ఖిలాడీ సినిమాకంటే మంచి టాక్ ఉంది అనే చెప్పొచ్చు..మరి ఈ సినిమా కి ఈ వీకెండ్ తో పాటుగా లాంగ్ రన్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి..అన్ని కుదిరితే ఈ సినిమా కచ్చితంగా 17 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంటుంది అని..టాలీవుడ్ కి ఇది పెద్ద రిలీఫ్ అవుతుందని నమ్ముతున్నారు..చూడాలిమరి వారి నమ్మకం ని రవితేజ నిలబెడుతాడో లేదో అనేది.