Home Entertainment రాధే శ్యామ్ సినిమా ఫలితం పై తొలిసారి స్పందించిన ప్రభాస్

రాధే శ్యామ్ సినిమా ఫలితం పై తొలిసారి స్పందించిన ప్రభాస్

0 second read
0
1
4,632

ప్రభాస్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో ని ఇంత సాఫ్ట్ రోల్ లో అభిమానులు చూడలేకపోయారు అనే చెప్పాలి,మొదటి మూడు రోజులు ప్రభాస్ కి ఉన్న అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించినప్పటికీ , సోమవారం నుండి పబ్లిక్ లో సరైన టాక్ లేని ప్రభావం సినిమా కలెక్షన్స్ పై చాలా గట్టిగానే పడింది అని చెప్పాలి, దీనితో ఈ సినిమా రన్ కేవలం వారం రోజుల లోపే క్లోసింగ్ కి దగ్గరలో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, దాదాపుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు బిసినెస్ జరగగా మొదటి వారం వసూళ్లు 80 కోట్ల రూపాయిల లోపే షేర్ ని సాధించింది, వచ్చే వారం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అవుతుండడం తో ఈ సినిమా రన్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఫాన్స్ టాలీవుడ్ సెలెబ్రిటీల పై సోషల్ మీడియా లో మండిపడుతున్నారు,ప్రభాస్ చిన్న పెద్ద అని తేడా లేకుండ ప్రతి సినిమాని ప్రోత్సహించే మంచి మనసు ఉన్న వ్యక్తి అని , కానీ మా ప్రభాస్ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఒక్క సెలబ్రిటీ కూడా రాధే శ్యామ్ సినిమా గురించి ట్వీట్స్ వెయ్యలేదు అని, టాలీవుడ్ సెలెబ్రిటీలపై ప్రభాస్ ఫాన్స్ మండిపడుతున్నారు, ఇటీవల విడుదల అయినా పుష్ప మరియు భీమ్లా నాయక్ సినిమాలకు ప్రతి సెలబ్రిటీ విషెస్ చెప్పారు అని, కానీ రాధే శ్యామ్ సినిమాకి మాత్రం ఒక్కరు కూడా ట్వీట్ వెయ్యలేదు అని, ఒక్కవేల సెలెబ్రిటీలు రాధే శ్యామ్ గురించి మాట్లాడి ఉంటె ఈరోజు కలెక్షన్స్ చాలా మెరుగ్గా ఉండేవి అని ప్రభాస్ ఫాన్స్ వాపోతున్నారు, అంతే కాకుండా ప్రభాస్ ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ ని వదిలేయాలి అని , శిఖరం లాంటి యాక్షన్ ఇమేజి ఉన్న ప్రభాస్ తో నేటివిటీ కి సంబంధం లేని సినిమాలు తీయించి ఆయన స్టార్ ధం ని పాడు చేస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు వాపోతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైన్ అప్ లో అభిమానులు అంత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా సాలార్, కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, ఈ సినిమా తో కచ్చితంగా ప్రభాస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని మరోసారి దున్నేస్తాడు అని అభిమానులు చాలా నమ్మకం తో ఉన్నారు, ఇక ఈ సినిమా తో పాటు ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలు కూడా లైన్ అప్ లో ఉన్నాయి,ఈ సినిమాలు అన్ని కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే నమ్మకం తో ఉండే సినిమాలే అని చెప్పవచ్చు, ఇక వీటితోపాటు డైరెక్టర్ మారుతి తో ఆయన త్వరలో రాజా డీలక్స్ అనే సినిమాని కూడా చెయ్యబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది, ఎలా చూసుకున్న ప్రభాస్ భవిష్యత్తు లో అభిమానులను రాధే శ్యామ్ సినిమా నిరాశ నుండి బయట పడేయడం ఖాయం అని తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…