
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను దాదాపుగా నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు చూసేలా చేసి మొత్తానికి మార్చ్ 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల అయ్యింది, మొదట్లో ఈ సినిమా పై సాధారణమైన అంచానాలే ఉన్నప్పటికీ, ట్రైలర్ అందరిని ఆకర్షించడం తో ఒక్కసారిగా జనాల్లో అంచనాలను అమాంతం పెంచేసేలా చేసింది,ట్రైలర్ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కనివిని ఎరుగని రీతిలో అన్ని బాషలలో కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయలకు జరిగింది , ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు బాగానే ఆడినప్పటికీ సోమవారం నుండి కలెక్షన్లు అతి దారుణంగా పడిపోయాయి, కలెక్షన్స్ ఈ స్థాయిలో పడిపోతాయి అని ట్రేడ్ వర్గాలు అసలు ఊహించలేదు, ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన టాక్ ప్రభాస్ గత సినిమా సాహూ తో పోలిస్తే మంచిగానే వచ్చింది అని చెప్పాలి, సినిమాలో ఫైట్స్ లేకపోడం , ప్రభాస్ కి ఉన్న విపరీతమైన మాస్ ఇమేజి వల్లే ఈ సినిమాని జనాలు ఆదరించలేకపొయ్యారు అని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక ఈ సినిమా రన్ దాదాపుగా పూర్తి కావొచ్చింది, సమీపం లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవ్వబోతుండడం తో ఈ సినిమా ప్రభావం రాధే శ్యామ్ పై తీవ్రంగా పడినట్టు తెలుస్తుంది, ఆర్ ఆర్ ఆర్ మూవీ థియేటర్స్ లో వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి సెంటర్ లో రాధే శ్యామ్ సినిమాని తీసి వెయ్యబోతున్నారు, ఒక్కసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది అనేది చూస్తే మొదటి రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి కేవలం 24 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసింది, ప్రభాస్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి, ఎందుకంటే దీనికి ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం అతి తక్కువ రేట్స్ మీద కూడా 26 కిమోట్ల రూపాయలకు పైగానే షేర్ ని మొదటి రోజు సాధించింది, కానీ రాధే శ్యామ్ కి టికెట్ రేట్స్ మరియు బెన్ఫిట్ షోస్ ఉన్నప్పటికీ కూడా భీమ్లా నాయక్ సినిమా కంటే తక్కువ వసూలు చెయ్యడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం,ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మొదటి రోజు భీమ్లా నాయక్ కంటే అత్యధిక థియేటర్స్ లో విడుదల అయ్యినప్పటికీ కూడా భీమ్లా నాయక్ కంటే తక్కువ వసూలు చేసింది.
కానీ తోలి మూడు రోజులు మాత్రం ఇంత క్లాస్ మూవీ కి కూడా ప్రభాస్ టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబట్టాడు అనే చెప్పాలి, మొదటి మూడు రోజులు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కి కలిపి 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు కలిపి దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ సాధించింది, అంతే ఇక సోమవారం నుండి నేటి వరుకు ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ కూడా వసూలు చెయ్యలేదు, మొత్తం మీద క్లోసింగ్ కి వచ్చేసరికి ఈ సినిమా అన్ని భాషలకు కలిపి 75 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది, సినిమా బిజినెస్ రెండు వందల కోట్ల రూపాయలకు జరగగా, రాధే శ్యామ్ కి దాదాపుగా 125 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లింది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇలా నష్టాల్లో ఇండియన్ ఫిలిం ఇంస్ట్రీ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డుగా చెప్పుకోవచ్చు, బాహుబలి మరియు సాహూ వంటి సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసిన ప్రభాస్ కి ఇలాంటి ఫలితం రావడం నిజంగా బాధాకరమే అని చెప్పాలి , ఇక నుండి అయినా ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ , క్రేజ్ కి తగట్టు సినిమాలు చెయ్యాలి అని సోషల్ మీడియా లో అభిమానులు ప్రభాస్ ని వేడుకుంటున్నారు.