
కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాలు అన్ని క్యూ కట్టి విడుదల అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటి వరుకు విడుదల అయినా సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి,ఇక ట్రేడ్ వర్గాలు అన్ని స్టార్ హీరోల సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి, ఆలా భారీ అంచనాలు నెలకొల్పిన స్టార్ హీరోల సినిమాలలో ఒక్కటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా, సాహూ సినిమా తర్వాత దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామ తర్వాత విడుదల అవుతున్న ప్రభాస్ సినిమా కాబట్టి ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉండడమా సహజం, ఇక ప్రభాస్ పుటిన రోజు సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ఈరోజు రాధే శ్యామ్ సినిమా టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,టీజర్ మొత్తం ఇంగ్లీష్ డైలాగ్స్ తో ఆరు బాషల సబ్ టైటిల్స్ తో నిండిపోయింది, ఇక ఈ టీజర్ లో మీరెవ్వరు గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
ఈ టీజర్ ని చూసినంత సేపు ఒక్క గొప్ప ప్రేమ కావ్యం ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది, ఇందులో ప్రభాస్ చెయ్యి చూసి జాతకాలు చెప్పే వాడిలా కనిపిస్తాడు,ఈ టీజర్ ని చూసినాక మనకి బాగా అర్థం అయినా విషయం ఏమిటి అంటే, ఈ సినిమా ఒక్క టైం మిషన్ నేపథ్యం లో సాగే సినిమాలాగే అనిపిస్తుంది, గతం లో ఇదే కాన్సెప్ట్ తో నందమూరి బాలకృష్ణ హీరో గా తీసిన ఆదిత్య 369 సినిమాని ఇప్పటికి మనం చూస్తూనే ఉంటాము, ఆ స్థాయిలో ఆ సినిమా ఘానా విజయం సాధించింది, రాధే శ్యామ్ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది, ఇక విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో విక్రమ్ ఆదిత్య(ప్రభాస్ ) ఒక్క కోటీశ్వరుడు, ఆయన ఒక్క సైంటిస్ట్ ద్వారా టైం మిషన్ లో గతం లోకి వెళ్తాడు, అక్కడ ప్రేరణ అనే అమ్మాయి విక్రమ్ ఆదిత్య కి పరిచయం అవుతుంది, తోలి చూపులోనే ప్రేమలో పడిన విక్రమాదిత్య ప్రేరణ కోసం ఏమి చెయ్యడానికి అయినా సిద్దపడేంతలా ప్రేమిస్తాడు, చెయ్యి చూసి జాతకాలు చెప్పే ప్రభాస్ ప్రేరణ జీవితం లో భవిష్యత్తులో జరగబొయ్యే దారుణాలను చూసి ఆమెని ఎలా కాపుదుకోగలిగాడు అనేదే స్టోరీ గా తెలుస్తుంది.
టీజర్ లో ఉన్న షాట్స్ అన్ని గమనిస్తే ఈ సినిమాని దర్శకుడు రాధా కృష్ణ హాలీవుడ్ రేంజ్ లో ఎక్కడ తగ్గకుండా తీసినట్టు అనిపిస్తుంది,ఫిలిం నగర్ లో ఎప్పటి నుండో గట్టిగ వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఈ సినిమా చూసి బయటకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు గర్వంగా ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా ఉంటుంది అట, ఒక్క మాటలో చెప్పాలంటే రాధే శ్యామ్ అనే సినిమా ఇండియన్ సినిమా టైటానిక్ గా నిలబడబోతుంది అట, మరి ఇంతలా అంచనాలు రేపిన ఈ సినిమా ఆ అంకణాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీ వరుకు ఆగాల్సిందే,ఈ సినిమా తో పాటు సంక్రాంతి రేస్ లో రాజమౌళి భారీ మల్టీస్టార్ర్ర్ ఆర్ ఆర్ ఆర్ కూడా విడుదల అవ్వబోతుంది, వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల కాబోతుంది, కానీ ఒక్కేసారి మూడు పెద్ద సినిమాలు విడుదల అయితే థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఒక్క సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం, మరి ఆ వెనక్కి వెళ్లే సినిమా ఏమిటో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.