
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ సాధించిన అతి తక్కువ మంది లో ఉదయ్ కిరణ్ ఒకడు..చిత్రం సినిమాతో పరిచయమైనా ఉదయకిరణ్ ఆ తర్వాత వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నేటి తరం ఏకైక హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు..అప్పట్లో ఉదయకిరణ్ కి యూత్ లో మాములు క్రేజ్ లేదు..అప్పట్లో ఇండస్ట్రీ దిగ్గజాలుగా కొనసాగుతున్న చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ కి బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమాలతో కలెక్షన్స్ పరంగా గట్టి పోటీని కూడా ఇచ్చాడు..చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ శాతం విజయాలు సొంతం చేసుకున్నాడు ఉదయకిరణ్..ఆలా కెరీర్ పీక్స్ కి పోతున్న సమయం లో ఉదయకిరణ్ కి వరుస ఫ్లాప్ సినిమాలు పలకరించాయి..ఎంత తొందరగా అయితే ఎవ్వరు ఊహించని శిఖరం స్థాయికి ఎదిగాడో..అంతే తొందరగా పాతాళలోకం లోకి పడిపోయాడు..సినిమా అనేది ఒక్క రంగుల ప్రపంచం..రాత్రికి రాత్రే తల రాత మారిపోతుంది అనడానికి ఉదయకిరణ్ ఒక్క ఉదాహరణ.
అలా సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ ని తట్టుకోలేక పొయ్యాడు..అవకాశాలు రాకపోయినా కూడా చాలా గట్టి ప్రయత్నాలే చేసాడు కానీ కాలం ఆయనకీ ఏ మాత్రం కలిసి రాలేదు..ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యాడు..చివరికి ఏ దారి కనిపించకపొయ్యేలోపు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు..అప్పట్లో ఈ ఘటన మన అందరిని ఎంత దుఃఖానికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయితే ఉదయ్ కిరణ్ అప్పట్లో వచ్చిన కొన్ని అద్భుతమైన అవకాశాలను చేతులారా మిస్ చేసుకున్నాడు..అందులో రాజమౌళి సినిమా కూడా ఒకటి ఉంది..రాజమౌళి దర్శకత్వం లో నితిన్ – జెనీలియా హీరో హీరోయిన్లు గా సై అనే సినిమా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..సింహాద్రి వంటి సెన్సషనల్ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అప్పట్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ ని సాధించింది..నితిన్ ని కమర్షియల్ గా నిలబెట్టింది ఈ చిత్రం.
అప్పటి వరుకు ఏ దర్శకుడు కూడా ఎంచుకోని రగ్బీ ఆటని కథాంశం గా తీసుకొని చేసిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది..అయితే ఈ సినిమా తొలుత ఉదయ్ కిరణ్ తో చెయ్యాలనుకున్నాడట రాజమౌళి..కానీ ఉదయ్ కిరణ్ అప్పటికే వేరే సినిమాకి కమిట్ అయ్యి ఉండడం తో ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చింది..రెండు నెలలు సమయం ఇస్తే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వస్తాను సార్..అప్పుడు కచ్చితంగా చేద్దాము మనం అని ఉదయకిరణ్ చెప్పాడట..తొలుత రాజమౌళి అందుకు ఒప్పుకున్నా..ఎందుకో ఆ తర్వాత నితిన్ కి షిఫ్ట్ అయ్యాడు..అలా నితిన్ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది..ఒక్కవేల నితిన్ ఈ సినిమాని ఒప్పుకొని చేసి ఉంటె ఆయన కెరీర్ గండం లో పడేది కాదని సినీ విశ్లేషకుల అభిప్రాయం..ఇది ఇలా ఉండగా తరుణ్ హీరో గా నటించిన సోగ్గాడు సినిమాని ఆ చిత్ర దర్శకుడు రవిబాబు మల్టీస్టార్ర్ర్ కథగా రాసుకున్నాడట..తరుణ్ మరియు ఉదయ్ కిరణ్ లను పెట్టి ఘనంగా తీద్దాం అనుకున్నాడు..కానీ ఉదయకిరణ్ ఈ సినిమాకి నో చెప్పడం వల్ల రవిబాబు స్టోరీ లో కీలక మార్పులు చేసి సింగల్ హీరో సినిమాగా చేసాడు..ఫలితం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది..ఇలా చాల సినిమాలే ఉదయకిరణ్ మిస్ చేసినట్టు తెలుస్తుంది.